తెలుగు ఇండస్ట్రీలో మోగా వారసుడిగా అడుగు పెట్టిన అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో డిఫరెంట్ స్టయిల్ చూపిస్తూ మెగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గత సంవత్సరం విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డబ్బు కన్నా మనిషి విలువలు చాలా గొప్పవి అని చాటి చెప్పిన చిత్రంగా అందరి మనసు దోచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి మాటలకు, గౌరవానికి విలువ ఇచ్చే కొడుకుగా బాగా నటించాడు.

తాజగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా... అల్లు అర్జున్, అంజలిపై చిత్రీకరించిన 'బ్లాక్ బస్టర్' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు.

సరైనోడు చిత్రంలో అంజలి


ఈ పాటలో అంజలి అందాలు ఆరబోసినట్లే కనిపిస్తుంది..ఇక బన్నీ స్టైయిలిష్ డ్యాన్స్ తో మరో సారి దుమ్ముదులిపాడు. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ అవుతుందని, మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని స్పష్టమవుతోంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: