రెండు వారాలకు ఒక సినిమాను రిలీజ్ చేస్తూ యంగ్ హీరోలు అందరికీ అర్ధం కాని పజిల్ గా మారిన నారా రోహిత్ ను ఏకంగా టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్ తో పోలుస్తూ ‘సావిత్రి’ సినిమా దర్శకుడు పవన్ సాధినేని చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. రేపు విడుదల కాబోతున్న ‘సావిత్రి’ సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు పవన్ సాధినేని ఈ కామెంట్స్ చేసాడు. 

గతంలో విక్టరీ వెంకటేష్ తన సినిమాల ఎంపిక విషయంలో అన్ని వర్గాల  ప్రేక్షకులను మెప్పించే విధంగా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ అయ్యేలా వెంకటేష్ ఎలా డిఫరెంట్ సినిమాలను చేసాడో ఇప్పుడు అదే మార్గాన్ని నారా రోహిత్ అనుసరిస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు పవన్. ‘సోలో’ సినిమా తర్వాత మళ్లీ రోహిత్ ను మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చూడాలని చాలామంది ఆశించారని ఆ కోరికను ‘సావిత్రి’ తీరుస్తుందని పవన్ చెపుతున్నాడు. 

రోహిత్ ఇందులో మెడికోగా కనిపిస్తాడని అతడి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అంటున్నాడు. హీరోయిన్ పేరునే టైటిల్ గా పెట్టడానికి నారా రోహిత్ ఎలా ఒప్పుకున్నాడని అడిగితే రోహిత్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అని అంటూ అతను కథకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని కామెంట్ చేసాడు ఈ విలక్షణ దర్శకుడు. 

ఇదే సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి వారం రోజుల్లో పవన్ ‘సర్దార్’ సినిమా వస్తుండగా ‘సావిత్రి’ సినిమాను రిలీజ్ చేయడం సాహసం కాదా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘‘వేసవి మొదలయ్యాక చాలా సినిమాలకు స్కోప్ ఉంటుంది. ప్రేక్షకులు రెండు మూడు రకాల సినిమాలు థియేటర్లలో ఉండాలని కోరుకుంటారు ఎంత పోటీ ఉ్నా మా సినిమా మీద మాకు నమ్మకముంది. కాబట్టి ‘సర్దార్’ వచ్చాక కూడా జనాలు మా సినిమాను చూస్తారన్న నమ్మకముంది’’ అంటూ దర్శకుడు పవన్ సాధినేని చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ చిన్న సినిమాను  ఓవర్సీస్ లో సుమారు 73 థియేటర్లలో రిలీజ్ చేస్తూ ఉండటం సంచలనంగా మారడమే కాకుండా పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సునామీకి భయ పడకుండా నారా రోహిత్ చేస్తున్న సాహాసం అతడి మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: