ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ త్వరలోనే ఉండటంతో…అభిమానులు ఈ మూవీని చూసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు తగ్గ ప్లానింగ్స్ ని రకరకాలుగా రెడీ చేసుకుంటున్నారు. అయితే వైజాగ్ లో ఓ థియోటర్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో చర్ఛలు జరుపుతున్నారు.


సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ మొదటి రోజుకి…. బెన్ఫిట్ షో..అలాగే మొదటి షో లను అభిమానులకి మాత్రమే ఇవ్వాలని కోరారు. దాదాపు 1200 కెపాసిటీ ఉన్న ఆ థియోటర్స్ ని రెండు షో ల కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. చేతిలో మనీ రెడీగా పట్టకొని వారు తిరుగుతున్నారు.


అయితే ఇక్కడ థియోటర్ నుండి వస్తున్న అభ్యంతరాలను చూస్తే…బెన్ఫిట్ షోకి, మొదటి ఆటకి చాలా మంది ప్రముఖులు ఆ థియోటర్ కి వచ్చే ఆ ఛాన్స్ ఉంది. అందుకు 300 టికెట్స్ మినహాయించి మిగత సీట్లను అమ్ముతానని అంటున్నారంట. అందుకు అభిమానులు అస్సలు ఒప్పుకోవటం లేదు.


థియోటర్ లో కేవలం వారికి సంబంధించిన వారు తప్పితే మిగతావారికి ఎంట్రీ లేకుండా ఉంటేనే, ఆ థియోటర్ ని బుక్ చేసేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు. మొత్తంగా సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ నాడు పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఈసారి మెగాస్టార్ ఫ్యాన్స్ సైతం ఓ రేంజ్ లో హంగామా చేయనున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: