సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది..అది టాలీవుడ్,బాలీవుడ్,కోలీవు ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది సహజం అంతే కాదు రాజకీయ వారసులు రాజకీయాల్లో..వ్యాపారస్తుల వారసులు వ్యాపారాల్లో వస్తున్నారు. అయితే స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన ఆటగాడు హైదరాబాద్ కు చెందిన అజారుద్దీన్. అయితే గత కొంత కాలం క్రితం అజారుద్దిన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జివిత కాల నిషేదానికి గురయ్యాడు.


అయితే ఈయనకు ఇద్దరు తనయులు వీరిలో ఒక బాబు యాక్సిడెంట్ లో చనిపోయాడు. తాజాగా మరో తనయుడు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే కథనాయకుడిగా పరిచయమవ్వనున్నట్లు తెలుస్తోంది. నాకు ‘ఓ లవ్వరుంది’ మూవీ నిర్మాత కె సురేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.


అబ్బాస్(అసదుద్దీన్)


ఈ సినిమా టైటిల్ కూడా నిర్ణయించినట్లు సమాచారం. ‘ఇద్దరికి కొత్తగా’ పేరుతో అబ్బాస్ సినిమా ప్రారంభం కానుంది. ఒక హీరోకి ఉండాల్సిన హైట్ పర్సనాలిటీ అబ్బాస్ కి సరిగ్గా ఉన్నాయి. మరి మనోడు నటనలో ఏ రేంజ్ లో అదరగొడతాడో తండ్రిలా సినిమాల్లో సిక్స్ లు కొడతాడో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: