విష్ణు, రాజ్ తరుణ్ కామెడీ ,రాజేంద్ర ప్రసాద్ ,మ్యూజిక్విష్ణు, రాజ్ తరుణ్ కామెడీ ,రాజేంద్ర ప్రసాద్ ,మ్యూజిక్అక్కడక్కడ ల్యాగ్ అవడం ,మాస్ అంశాలు మిస్
అర్జున్(మంచు విష్ణు), అశ్విన్ ఇద్దరు స్నేహితులు.. అర్జున్ లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు కాగా.. అశ్విన్ ఎస్.ఐ కోటేశ్వర రావు (పోసాని కృష్ణమురళి) కొడుకు. ఆవారాగా తిరుగుతూ ఎంజాయ్ చేసే వీరిద్దరు కిశోర్ (వెన్నెల కిశోర్) పెళ్లిలో అర్జున్ నీలవేణి (సోనారిక బడోరియా) చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అయితే ఆమె పెళ్లంటూ చేసుకుంటే అనాథనే చేసుకుంటానని తన స్నేహితులతో చెప్పడం విని తానో అనాథగా పరిచయమై ప్రేమలో పడేస్తాడు. నీలవేణి అన్న దత్తు (అభిమన్యు సింగ్) చెల్లలంటే ప్రాణం. చెల్లి ప్రేమించిందని అర్జున్ ను బావగా అంగీకరించి వెంటనే రిజిస్టార్ ఆఫీస్ లో పెళ్లి చేస్తాడు. తనకు ఫ్యామిలీ ఉన్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో అర్జున్ పెళ్లి చేసుకుంటాడు. ఇక అప్పటి నుండే అసలు కథ మలుపు తిరుగుతుంది. అర్జున్ వాళ్ల ఇంట్లోనే నీలవేణి అద్దెకు దిగడం అర్జున్ ప్లేస్ లో నీలవేణి భర్తగా అశ్విన్ రావడం జరుగుతుంది. ఇక మరో పక్క అశ్విన్ సుప్రియ (హెభా పటేల్) ను ప్రేమించడం జరుగుతుంది. సుప్రియ అన్న గజ (సుప్రీత్) అశ్విన్ ను కలవాలి అని చెప్పడంతో అర్జున్ సలహా మేరకు అర్జున్ వాళ్ల ఇంట్లోనే వాళ్ల మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇంతకీ నీలవేణి భర్త అర్జునా..? అశ్వినా..? సుప్రియ ప్రేమించింది ఎవరిని..? వీరందరికీ లాయర్ నారాయణ ఇంట్లో ఏం పని..? నారాయణ కన్ ఫ్యూజన్ కు కారణాలు ఏంటి..? అసలు ఈ కన్ ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది..? అన్నదే అసలు కథ.     



ఈడోరకం.. ఆడోరకం.. లాంటి కన్ ఫ్యూజ్ కథలకు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగా పండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోలుగా చేసిన ఇద్దరు మంచు విష్ణు, రాజ్ తరుణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. విష్ణు తన ఢీ సినిమాలో ఉన్న ఈజ్ ను ఈ సినిమాలో చూపించి మంచి ఎంటర్టైన్ ఇచ్చాడు. ఇక రాజ్ తరుణ్ కూడా అల్లరి చిల్లర్ క్యారక్టర్ లో అదరగొట్టేశాడు. సినిమా మొత్తం ఫుల్ ఎనర్జీతో రాజ్ తరుణ్ సినిమాకు తన వంతు సహకారాన్ని అందించాడు. హీరోయిన్స్ విషయానికొస్తే సోనాలికా బడోరియా తన చూపులతోనే కాదు అంద చందాలతో కూడా ఆడియెన్స్ ను మైమరిచిపోయేలా చేసింది. సాంగ్స్ లో అమ్మడి స్కిన్ షో కలర్ ఫుల్ తెచ్చింది. సోనారికా చేసిన ఇన్ని సినిమాల్లో ఈ సినిమా తనకు మంచి ఫీడ్ బ్యాక్ తెస్తుందని చెప్పొచ్చు. 


ఇక కుమారిగా కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన హెభా మరోసారి తన మార్క్ నటనతో పాటుగా తన స్కిన్ షోతో అదరగొట్టింది. ముఖ్యంగా సినిమాలో విష్ణు, సోనారికాల పెయిర్.. రాజ్, హెభాల జంట చూడముచ్చటగా ఉంది. ఇక సినిమాలో నారాయణగా ప్రేక్షకులను మరోసారి నవ్వించే ప్రయత్నం చేశారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ముఖ్యంగా తన ఇంట్లో జరుగుతున్న ఈ బాగోతాన్ని తాను పసిగట్టే క్రమంలో పంచే కామెడి కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు రవిబాబు, రాజేంద్ర ప్రసాద్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కామెడీని పండిస్తాయి. ఓవరాల్ గా ఎవరికి ఇచ్చిన పాత్రలను వారు నూటికి నూరుపాళు న్యాయన్ చేశారని చెప్పాలి.   


సినిమా కలర్ ఫుల్ గా రావాలంటే సినిమ దర్శకుడు, నిర్మాత, యాక్టర్స్ మాత్రమే కాదు సినిమాలో పనిచేసే అన్ని విభాగాల వారు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలి. ఈడోరకం ఆడోరకం సినిమాకు దాదాపు అదే జరిగింది అని చెప్పాలి. హాట్ సమ్మర్ లో కామెడీ ఎక్స్ ప్రెస్ లాంటి కూల్ సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సినిమా కాప్టెన్ ఆఫ్ ది షిప్ జి.నాగేశ్వర రెడ్డి. తన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుచి చూపించాడు. కామెడీ సినిమాల్లో తనకున్న కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేశాడు. 


ఈడోరకం ఆడోరకం మరో మేజర్ హైలెట్ మ్యూజిక్.. ప్రస్తుతం ఫుల్ ఫాం మీదున్న యువ కెరటం సాయి కార్తిక్ సినిమాకు మంచి మ్యూజిక్ అందించి సినిమాను హిట్ దిశగా పయనించేలా చేశాడు. సాంగ్స్ అన్ని పర్వాలేదనిపించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మంచి హెల్ప్ అయ్యింది. ఇక సిద్ధార్థ్ వర్మ కెమెరా పనితనం కూడా బాగుంది. హీరోలిద్దరు స్క్రీన్ మీద అందంగా కనిపించారు. ఇక హీరోల కన్నా హీరోయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడియెన్స్ కు మజా కలిగేలా చేశాడు. ఇలాంటి కన్ ఫ్యూజ్ కథనాలకు ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉండాలి ఆ విషయంలో ఎం.ఆర్ వర్మ పనితనం బాగుందని చెప్పాలి. అక్కడక్కడ కాస్త లాగ్ అయినట్టు అనిపించినా మళ్లీ సెట్ చేసేశాడు. ఇక ఏ.కె ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచి రిచ్ గా ఉన్నాయి. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా డైమండ్ రత్నం మాటలు కూడా సినిమాకు మంచి హెల్ప్ అయ్యాయి.      


మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు నట వారసత్వాన్ని అందుకున్న మంచు విష్ణు గత కొంతకాలంగా హిట్ కోసం తపించి ఉన్నాడు. అయితే సినిమా పరంగా తన వరకు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతున్న విష్ణు సక్సెస్ కొట్టడంలో కాస్త వెనుకపడుతున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న రాజ్ తరుణ్ కు లాస్ట్ రిలీజ్ సీతమ్మ అందాలు సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా పోవడం వల్ల అలోచనలో పడ్డ రాజ్ తరుణ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. ఈఇద్దరు కలయికతో వచ్చిన సినిమా ఈడోరకం.. ఆడోరకం.. టైటిల్ కు కరెక్ట్ యాప్ట్ అయ్యేలా తమ క్యారక్టరైజేషన్ కు తగ్గట్టు తమ బాడీ లాంగ్వేజ్ ఏర్పరచుకున్నారు విష్ణు, రాజ్ తరుణ్. సినిమా మొత్తం వీరిద్దరి మీద నడుస్తుండటం తో కామెడీకి ఎక్కువ స్కోప్ దొరికింది.   


విష్ణు తన టైమింగ్ తో ఆకట్టుకుంటే రాజ్ తన పంచ్ లతో ప్రేక్షకులను అలరించేలా చేశాడు. ముఖ్యంగా కథ మొదలయ్యేది విష్ణు అనాధ అని చెప్పిన ఓ చిన్న అబద్ధంతో.. ఆ అబద్దాన్ని నిజమని నమ్మించడం కోసం రాజ్ తరుణ్ ని వాడుకోవడం ఇలా అంతా కామెడీగా జరుగుతుంది. అయితే ముందు సినిమా ఓపెనింగ్ లోనే దత్తన్న, గజన్న అంటూ భారీ రౌడితనంతో చూపించిన అభిమన్యు, సుప్రీత్ ల పాత్రలు చివర ఫూల్స్ గా చేయడం కాస్త విడ్డూరంగా ఉంటుంది. ఇక సినిమాలో పెద్ద జోకర్ ఎవరంటే నారాయణ పాత్ర చేసిన రాజేంద్ర ప్రసాద్ ఆయన పాత్రకు ఆయన వంద శాతం న్యాయం చేసినా ఓ లాయర్ తరహా హోదాలో ఉన్న వ్యక్తి తన ఇంట్లో ఏం జరుగుతుంది అన్న కన్ ఫ్యూజ్ తెర దించలేకపోవడం విచిత్రం.    


పంజాబి సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు చక్కగ్గా అనువదించారు. నాగేశ్వర రెడ్డి తన మార్క్ ను మరోసారి ఈ సినిమాతో చూపించాడు. అయితే మరికొన్ని సీరియస్ అంశాలు కథలో మేళవింపు చేస్తే సినిమా ఇంకా బాగా వచ్చేది అనే భావాన్ కలుగుతుంది. ఒక్క చూపులోనే చూసిన హీరోయిన్ ప్రేమించడం అంతలోనే పెళ్లి అంతలోనే కాపురం ఇవన్ని ఆడియెన్స్ నమ్మేందుకు అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ సమ్మర్ లో కాసేపు హాయిగా నవ్వుకుని వచ్చేద్దాం అనుకున్న వారికి ఈ సినిమా నచ్చుతుంది అంతేకాని లాజిక్ లు.. మ్యాజిక్ లు వెతికితే మాత్రం కష్టం.


Manchu Vishnu,Raj Tarun,G.Nagewar Reddy,Sonarika Bhadoria,Hebah Patel,Sai Kartheekఈడోరకం.. ఆడోరకం.. అన్ని రకాలు కలిపి నవ్వించారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: