తెలుగు ఇండస్ట్రీలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పెళ్లి’ చిత్రంలో విలన్ గా తెగ హంగామా చేసిన ప్రముఖ సౌతన్ ఇండియా నటుడు బబ్లూ పృథ్విరాజ్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పెను సంచలనాలు సృష్టింస్తుంది. గత సంవత్సరం సీనియర్ నటులు రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం..రీసెంట్ గా టీవి నటి, తమిళ టివీ నటుడు, బాలీవుడ్ టీవి నటిమణి ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో బబ్లూ పృథ్విరాజ్ ఆత్మహత్య చేసుకోవడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీడియోలో పృథ్వీరాజ్ తన చేతి మనికట్టును కోసుకోవడంతో ఒక్కసారిగా షాకయ్యారు ప్రేక్షకులు.  తాజాగా పృథ్వీరాజ్ ఈ తరహా వీడియోతో ఒక్కసారిగా సంచలనం సృష్టించారు.


 పృథ్విరాజ్ ఆత్మహత్య చేసుకోవడం


ఆ...  తాజాగా పృథ్వీరాజ్  ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా కాదండీ బాబు కేవలం ఒక సోషల్ అవైర్ నెస్ కోసం చేసి వీడియో మాత్రమే... గత సంవత్సరం తెలుగు నటులు రంగనాథ్, ఇటీవల కాలంలో టీవీనటి ప్రత్యూష బెనర్జీ, టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలకు పాల్పొడద్దని చేసిన వీడియో.  

 పృథ్విరాజ్ ఆత్మహత్య 


6 నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ఈ వీడియో చివర్లో మీ స్కిన్ పేపర్ కాదు…దానిని కట్ చేయొద్దు, మీ ముఖం మాస్క్ కాదు… దాన్ని దాచొద్దు, మీ జీవితం సినిమా కాదు..దాన్ని ముగించొద్దు అంటూ పృథ్విరాజ్ సందేశం ఇచ్చారు. ఈ వీడియోలో సూసైడ్ చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు అనే సందేశం ఇచ్చారు పృథ్వీరాజ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: