టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎన్నో అంచనాలతో ఉగాది పండుగ రోజున రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ముందు విపరీతమైన క్రేజ్ వచ్చింది..ఒక రకంగా చెప్పాలంటే బాహుబలిని మించిపోతుందా అన్ని డౌట్ కలిగించింది. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం  బాహుబలి రికార్డులను బద్దలు కొట్టబోతుందని అన్నారు. తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు..వీడియో మేకింగ్,ప్రోమోలతో దుమ్మురేపారు. పవన్ కళ్యాన్ మొదటి సారిగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. ఇక సినిమా విడుదల తర్వాత మిశ్రమ స్పందన రావడంతో అందరూ నిరాశ పొందారు.

సర్ధార్ గబ్బర్ సింగ్


అయితే ఇప్పుడు ఈ చిత్రంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూన్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ దర్శకులు  నటుడు దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు తాజాగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పై షాకింగ్ కామెంట్స్ చేసాడు.  శ్రీకాంత్ తాజా చిత్రం 'మెంటల్ పోలీస్' ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిధి గా విచ్చేసిన దాసరి సర్దార్ చిత్రం పై మతి పోయే కామెంట్స్ చేసాడు. ఈ మద్య చాలా మంది కథను కాకుండా ఇమేజ్ ని నమ్ముతున్నారని.. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు తప్ప కధలో కంటెంట్ ఉండడం లేదు.

సర్ధార్ గబ్బర్ సింగ్ 


కోట్లు ఖర్చు పెట్టి భారీ భారీ సెట్లు, విదేశాల్లో పాటలు చిత్రీకరణలు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్ చేస్తున్నారు తప్ప, కధని పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తం పెట్టి తీసి కూడా ఫ్లాప్ గా నిలిచిన చిత్రం ఏమైనా ఉందా అంటే అది 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం మాత్రమే అని దాసరి అన్నారు. ఒక చిత్రం తీసే ముందు బలమైన కథ ఉంటే దాన్ని అంచనాలు వేసుకొని బడ్జెట్ ఫాలో అయితే బాగుంటుందని  తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుకోవచ్చని అన్నారు దాసరి నారాయణ రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: