‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తరువాత ఆ షాక్ నుండి నెమ్మదిగా తేరుకుంటున్న పవన్ కళ్యాణ్ నిన్న త్రివిక్రమ్ నితిన్ ల ‘అ ఆ’ సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చి కాసేపు ఆ యూనిట్ తో సరదాగా టైమ్ స్పెండ్ చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన ఒక ఫోటోను పవన్ కు దేముడు ఇచ్చిన తమ్ముడు నితిన్ తన ట్విటర్ లో పెట్టి అందరికీ షేర్ చేసాడు. 

పవన్ చాల సదాసీదాగా కనిపిస్తున్న ఈ ఫోటోలో పవన్ ఎదో ఒక విషయమై సీరియస్ గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ ప్రియ స్నేహితుడు త్రివిక్రమ్ వీరాభిమాని నితిన్ లతో పాటు ఈ సినిమా యూనిట్ సభ్యులు అంతా పవన్ చెపుతున్న మాటలను శ్రద్దగా వినడం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

నితిన్ ఎన్నో ఆసలు పెట్టుకున్న ‘అ ఆ’ మూవీ ఆడియో విడుదల ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న నేపధ్యంలో ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ ముఖ్య అతిధిగా వస్తాడు అన్న వార్తలు ఇప్పటికే ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో త్వరలో ప్రారంభం చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ విషయమై పవన్ త్రివిక్రమ్ సలహాలు తీసుకోవడానికి ఇలా హఠాత్తుగా ‘అ ఆ’ సెట్స్ పై కనిపించి త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చాడని టాక్. 

అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా నిజంగా పవన్ ఎస్.జె. సూర్యల మూవీ స్క్రిప్ట్ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సలహాలు ఉంటే నిజంగానే అది పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎస్.జె. సూర్యా గురించి భయపడుతున్న పవన్ అభిమానుల భయాలు పూర్తిగా త్రివిక్రమ్ రాకతో తొలిగి పోతాయి. మరి ప్రియ మిత్రుడు కోసం త్రివిక్రమ్ ఆ మాత్రం సహాయం పవన్ కు చేస్తాడో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: