నిన్నఉదయం ప్రారంభం అయిన బాలకృష్ణ  ‘గౌతమీపుత్రా శాతకర్ణి’ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగినా ఒకలోటు నందమూరి అభిమానులను తీవ్రంగా కలిచివేసింది అన్న వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి రాజకీయ రంగానికి సంబంధించి ఎందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నా బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ అతడి పిల్లలు కళ్యాణ్ రామ్ జూనియర్లు ఎక్కడా కనిపించకపోవడం అందరికీ చాల ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. 

మెగా కుటుంబ సభ్యులలో అభిప్రాయ భేధాలు ఉన్నా అవి ఎక్కడా బయట పడనివ్వకుండా మెగా కుటుంబ హీరోలు అద్భుతంగా నిజజీవితంలో కూడ నటిస్తూ ఉంటే ఆ పాటి నటన నందమూరి కుటుంబ హీరోలలో ఎందుకు కనిపించడం లేదు అని నందమూరి వీరాభిమానులు ఈ ఫంక్షన్ లో కామెంట్ చేసుకున్నట్లు టాక్. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ జూనియర్ తనకు తన బాబాయ్ బాలకృష్ణకు మధ్య భేదాభిప్రాయాలు లేవని ఓపెన్ గానే సంకేతాలు ఇచ్చాడు.

అయితే ఈ ఇంటర్వ్యూ ఇచ్చి 3 నెలలు గడవకుండానే జూనియర్ తాను చేసిన కామెంట్స్ ను తానే అనుసరించ లేకపోయాడు అన్న కామెంట్స్ నందమూరి అభిమానులలో వినిపిస్తున్నాయి. జూనియర్ వ్యూహాత్మకంగా తన ట్విటర్ లో తన బాబాయ్ ని అభినందిస్తూ ట్విట్ చేసినా బాగుండేది కదా అన్న అభిప్రాయం చాలామంది నందమూరి వీరాభిమానులలో ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. 

జూనియర్ కు వ్యక్తిగతంగా ఎంత ఇమేజ్ ఏర్పడినా నందమూరి కుటుంబ వారసత్వాన్ని తన మాటలలో చేతలలో కోన సాగిస్తున్న నేపధ్యంలో తన మనసులో ఏమి ఉన్నా తన బాబాయ్ ని అభినందిస్తూ ఒక ట్విట్ చేసి ఉంటే చాల హుందాగా ఉండేదని నందమూరి అభిమానుల వాదన. తన బాబాయ్ సినిమా ప్రారంభోత్సవం రోజున మౌనంగా ఉన్న జూనియర్ రాబోతున్న తన తాత నందమూరి తారక రామారావు పుట్టినరోజునాడు మాత్రం తన ‘జనతాగ్యారేజ్’ ట్రైలర్ ను విడుదల చేస్తూ తాను నందమూరి కుటుంబ వారసుడునే అని మరోసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు జూనియర్..  


మరింత సమాచారం తెలుసుకోండి: