తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో పెద్దగా విజయాలు సాధించలేక పోయాడు..కానీ స్టయిలిష్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘శివ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు..అప్పటి నుంచి నాగ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతే కాదు నాగార్జున ప్రయోగాత్మక చిత్రాలు నటిస్తూ మంచి విజయాలు సాధించారు..భక్త రస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి లో అద్భుతమైన నటన కనబర్చడంతో తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు.  

సోగ్గాడే చిన్నినాయనా చిత్రం పోస్టర్


గత మూడు సంవత్సరాల క్రితం పెద్దగా విజయంతమైన సినిమాలు రాలేదు..ఇక అక్కినేని మూడు తరాల చిత్రం ‘మనం’ తో హిట్ కొట్టడం మొదలు పెట్టాడు..ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం కనీవినీ ఎరుగుని రీతిలో విజయం సాధించింది. ఈ చిత్రం నాగ్ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలచింది. ఇక పంచె కట్టులో నాగ్ చేసిన సందడి ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాటి నటించగా అనసూయ, హంసానందిని, దీక్షాపంత్, అనుష్క లు కీలక పాత్రల్లో నటించారు.

సోగ్గాడే చిన్నినాయనా 


కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఆదోనిలలో వంద రోజులు ఆడింది. ఈ సందర్భంగా నాగ్ ఫ్యాన్స్ వంద రోజుల వేడుకని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బంగార్రాజు పాత్ర నాగార్జునలోని ఎనర్జీ ఎంటో మరోసారి చూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: