పూరి జగన్నాధ్ ఈమధ్య మహేష్ తో ‘జనగణమన’ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నాను అంటూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ టైటిల్ ను నిర్మాత దిల్ రాజ్ రిజిస్టర్ చేసికుని ఉండటంతో ఈ టైటిల్ అసలు పూరి జగన్నాథ్ కు ఎలా వచ్చింది అని చాలమంది ఆశ్చర్యపోయారు. మరికొందరు అయితే ఈ సినిమాకు ఛార్మీ నిర్మాతగా వ్యహరిస్తుంది అనే ఊహగానాలు కూడ చేసారు.  

కానీ అసలు విషయం వేరే ఉంది అని అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు వినిపిస్తున్నాయి. మహేష్ తో సినిమాను పూరి అనుకున్న వెంటనే ‘జనగణమన’ టైటిల్ అయితే బాగుంటుంది అని పూరి గట్టిగా భావించాడు అని టాక్. అయితే ఆ టైటిల్ అప్పటికే దిల్ రాజు దగ్గర వుందని తెలియడంతో పూరి వ్యూహాత్మకంగా ఛార్మీని దిల్ రాజ్ పై ప్రయోగించాడు అని టాక్. 

అయితే మహేష్ తో తీయబోతున్న సినిమా కోసం ఈ టైటిల్ అన్న విషయం బయటకు వస్తే దిల్ రాజు అంత సులువుగా తన టైటిల్ వదలడు అన్న ఉద్దేశంతో ఛార్మి చేత  తాను తీయబోయే ఒక చిన్న సినిమాకు ఈ టైటిల్ కావాలని దిల్ రాజ్ ను అడిగిందట ఛార్మీ. ఆ తరువాత ఈ విషయమై దిల్ రాజ్ ఛార్మీల మధ్య ఏ ఆర్ధిక లావాదీవీలు నడిచాయో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా దిల్ రాజ్ ఛార్మీ మాటలు నమ్మి తన ‘జనగణమన’  టైటిల్ ను ఛార్మీకి ఇచ్చిన ట్లు టాక్. 

ప్రస్తుతం ఈ టైటిల్ ఛార్మీ దగ్గర ఉన్న నేపధ్యంలో పూరి జగన్నాథ్ కాకుంటే మరి  ఎవ్వరు అయినా సరే మహేష్ తో సినిమా తీస్తే చాలు ఈ పవర్ ఫుల్ టైటిల్ ఇచ్చేస్తాను అని  చెపుతోందట ఛార్మీ. అయితే ప్రస్తుతం పూరి ఛార్మీలకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఎప్పటికైనా ఈ టైటిల్ పూరి సొంతమే అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: