పక్కా ప్రణాళికతో వెళ్తే ఏ సినిమా అయినా సక్సెస్ కొట్టచ్చు.. అంతేకాదు సినిమా జనాలను మిస్ గైడ్ చేయకుండా ఉంటే మొదట ఆట చూసిన ప్రేక్షకులు సినిమా చూసి పెదవి విరిచే అవకాశం ఉండదు. అయితే ఇవన్ని జరగాలంటే ముందు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో చేసే ప్రమోషన్స్ కారణం. ఇప్పుడు టివి పెడితే కనిపించే స్టార్ ఒక్కడే అతనే సూపర్ స్టార్ మహేష్. 


ఓ హీరో తన సినిమాను పర్ఫెక్ట్ గా ప్రమోట్ ఎలా చేయాలో మహేష్ కు మాత్రమే తెలుసు అనిపిస్తుంది. అంతేకాదు బ్రహ్మోత్సవం సినిమా తన భుజస్కందాల మీద వేసుకుని ఎన్ని చానెల్స్ ఉన్నాయో వాటికే కాదు.. సోషల్ సైట్స్ కూడా మహేష్ ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం. అసలు జనాల్లోకి రావడమే ఇష్టపడని మహేష్ వన్స్ డిసైడ్ అయితే ఎలా విజృంభిస్తాడో చూపిస్తున్నాడు. 


దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత పివిపి వీరెవరు లేకుండా కేవలం మహేష్ మాత్రమే ఒంటరిగా తన సినిమా ప్రచారం సాగిస్తున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫీవర్ ప్రేక్షకుల్లో స్టార్ట్ అయ్యింది. ఇక మే 20 నుండి మహేష్ చెప్పిన ఉత్సవాలు స్టార్ట్ అవుతాయనే అనుకుంటున్నారు అభిమానులు. 


ప్రచారంలో సరికొత్త మార్గాలను ఎన్నుకుంటున్న మహేష్ తానో సూపర్ స్టార్ అన్న ఫీలింగే లేకుండా అన్ని ప్రసార మాధ్యమాలకు సినిమా గురించి ఇంటర్వ్యూస్ ఇస్తూ మరోసారి సినిమా ప్రేక్షకుల్లో తీసుకెళ్లే విధానంలో తాను సూపర్ అనిపించుకున్నాడు. మరి ఇన్ని సంచలనాలు చేస్తున్న మహేష్ సినిమా ఫలితాన్ని ఎలా అందుకుంటాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: