తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా చాలా మంది ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లే ఉన్నారు. అందులో సక్సెస్ అయిన హీరోయిన్లు కొద్దిమందే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో 2001 సంవత్సరంలో ‘నీ తోడు కావాలి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ ముద్దుగుమ్మ చార్మి. ఈ చిత్రం తీసే సమయంలో ఈ అమ్మడి వయసు పద్నాలు సంవత్సరాలే.. అప్పటికి ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. అయితే తెలుగులో వచ్చిన మొదటి చిత్రం పెద్ద విజయం సాధించక పోయినా కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అక్కడ ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో చార్మి హీరోయిన్ గా గుర్తింపు లభించింది.

నీ తోడు కావాలి చిత్రం పోస్టర్


దీంతో తమిళంలో వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఇక తెలుగులో కృష్ణ వంశి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ శ్రీ ఆంజనేయం’ చిత్రంలో చార్మి చూపించి అందాలకు అప్పట్లో అందరూ ఔరా అనుకున్నారు. ఈ చిత్రంలో విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో అప్పట్లో కుర్రకారు మనసు కొల్లగొట్టింది. దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. వాస్తవానికి చార్మి పంజాబీకి చెందిన అమ్మాయి అయినా అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండటం మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.

‘ శ్రీ ఆంజనేయం’ చిత్రంలో చార్మి


ఈ అమ్మడికి   తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. 2007 డిసెంబరు లో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

జ్యోతి లక్ష్మి చిత్రంలో చార్మి


గత సంవత్సరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో నటించిన చార్మి సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడి నటనకు వంద మార్కులు పడ్డాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చార్మికి ఏపీహెరాల్డ్.కామ్ తరుపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి: