సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. వెంకటేష్, మహేష్ లు కలసి నటించిన ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చూసిన వారందరూ సీతగా అంజలి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మయిగా సీత అద్భుతమైన నటన కనబర్చిందని, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత తెలుగు తెరకు మరో మంచి హీరోయిన్ దొరికిందని అంతా అంటున్నారు. కాగా, అనుకోకుండా ఈ సినిమాలో ‘సీత’గా అంజలి ఎంపిక అయ్యింది. త్రిష, నయనతార మొదలైనవారిని ఈ పాత్రకు ముందుగా అనుకున్నారు. అయితే ఈ పాత్ర చివరికి అంజలిని వరించింది. అమెకు మంచి పేరు తీసుకుని వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: