తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘అష్టచమ్మ’ చిత్రంతో హీరోగా అదిరిపోయే పర్ఫామెన్స్ తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ గా నడిచినా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గత సంవత్సరం మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్ ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ చిత్రం కూడా అద్భుత విజయం సాధించడంతో నాని చిన్ని నిర్మాతల పాలిట మినిమం గ్యారెంటీ హీరోగా నిలిచిపోయాడు.

జెంటిల్ మెన్ చిత్రంలో నాని


ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘జెంటిల్ మెన్’ గా మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అష్టాచెమ్మా కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మరో హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే జెంటిల్‌మెన్ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.  ఈ సినిమాలో నాని హీరోనా..? విలనా..? అన్న సస్పెన్స్ ను మరింత కాంప్లికేట్ చేస్తూ ట్రైలర్ ఉంది.  


జెంటిల్ మెన్ చిత్రంలో నాని, నివేదితా థామస్


ఈ ట్రైలర్ ముందు కాస్త రొమాంటిక్ యాంగిల్ కనిపించి.. తర్వాత మాత్రం నానిలోని హీరోను, విలన్ ను పరిచయం చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీ రోల్ చేసినట్లు కనిపిస్తోంది.మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన సురభి, నివేదితా థామస్ కథానాయికలుగా నటిస్తుండగా ఈ చిత్రం థ్రిల్లర్ మూవీగా రూపొందినట్టు సమాచారం. సోషల్ నెట్ వర్క్ లో జెంటిల్ మెన్ ట్రైలర్ హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: