పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుని అని భావిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ భజన చేసే  పవన్ వీరాభిమాని నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అ ఆ’ పై పవన్ మూవీ ‘తీన్మార్’ ప్రభావం ఉంది అన్న విషయాన్ని స్వయంగా నితిన్ బయట పెట్టాడు. ‘అ ఆ’ సినిమాలో తాను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని చెఫ్ పాత్రలో కనిపిoబోతున్నానని తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ‘తీన్మార్ సినిమాలో చెఫ్ గా చేసిన మైఖేల్ వేలాయుదమ్ క్యారెక్టర్ పోలికలు తన ‘అ ఆ’ సినిమాలోని చెఫ్ పాత్ర పై లేకపోయినా తాను అభిమానించే పవన్ కళ్యాణ్ చేసిన చెఫ్ పాత్ర తాను కూడ చేయడం ఆనందంగా ఉంది అని కామెంట్ చేసాడు నితిన్.
 
తాను చాల కాలం క్రితం ‘హార్ట్ ఎటాక్’ సినిమా చేస్తున్న రోజులలో త్రివిక్రమ్ తనకు ఫోన్ చేసి ఈ సినిమా కథ తనకు చెప్పారని అయితే కొన్ని అవాంతరాల వలన ఈ సినిమాను పట్టాలెక్కించడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టేసిందని నితిన్ చెబుతున్నాడు. తన 14 సంవత్సరాల కెరియర్ లో తాను నటించిన 22 సినిమాలు ఒకెత్తయితే ‘అ..ఆ’ ఒకెత్తు అంటూ తన  యాక్టింగ్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్ చివరకు హెయిర్ స్టయిల్ కూడా కొత్తగా ఉంటుంది అన్న విషయాన్ని బయట పెట్టాడు నితిన్.

ఈసినిమాకు తాను హీరోని కానని హీరో దర్శకుడు త్రివిక్రమ్ మాత్రమే అంటూ ఈ సినిమా పై ఎటువంటి ప్రశంసలు విమర్శలు వచ్చినా అవి త్రివిక్రమ్ కే చెందుతాయి అంటూ చాల వ్యుహత్మకంగా మాట్లాడాడు నితిన్.  ఈ వార్తలు ఇలా ఉండగా నితిన్ కు ఓవర్సీస్ లో అంత మార్కెట్ ఏమీ లేకపోయినా ‘అ ఆ’ మూవీ అమెరికాలో 130కి పైగా స్క్రీన్లలో రిలీజవుతుండటంతో పాటు  ఓవర్సీస్ లో మొత్తంగా ఈ సినిమాను 200కు పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్న విషయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

దీనితో యుఎస్ ఆడియన్స్ లో త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను మరోసారి ‘అ ఆ’ రుజువు చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ చెఫ్ పాత్రలో నటించిన ‘తీన్మార్’ ఫ్లాప్ సినిమాగా మారింది. మరి నితిన్ కు పవన్ నటించిన ఆ చెఫ్ పాత్ర ఎటువంటి అదృష్టాన్ని ఇస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: