నటుడు పోసాని కృష్ణమురళి సినిమా నటుడుగా మారక ముందు దాదాపు 100 సినిమాలకు స్క్రిప్ట్ ను అందించిన సినీ రచయిత అన్న విషయం కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. పోసాని రచయితగా బిజీగా ఉన్న రోజులలో 1990 ప్రాంతాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి  పోసాని వద్ద త్రివిక్రమ్ 4 సంవత్సరాలు సహాయకుడిగా పనిచేసాడు. 

ఇప్పుడు అ విషయాలను గుర్తు చేసుకుంటూ ‘అ ఆ’ సినిమాను ప్రమోట్ చేస్తూ పోసాని త్రివిక్రమ్ గురించి కొన్ని ఆ సక్తికర విషయాలను బయట పెట్టాడు. ఆ రోజులలో తన టీమ్ లో ఎంతోమంది రచయితలు ఉన్నా త్రివిక్రమ్ లో తనకు ఎదో తెలియని ప్రతిభ తనను ఆకర్షించింది అని అంటూ అయితే త్రివిక్రమ్ ఎప్పుడూ చాల మూడీగా కనిపించేవాడని త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని.  

అయితే బిడియంగా ఆనాడు తన వద్దకు వచ్చిన త్రివిక్రమ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటూ అప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే త్రివిక్రమ్ ఇప్పుడు గెడ్డం బాగా పెంచి కనిపిస్తున్నాడు అంటూ సెటైర్లు వేసాడు పోసాని. ఇదే సందర్భంలో పోసాని త్రివిక్రమ్ గురించి మరొక ఆ శక్తికర సంగతి బయట పెట్టాడు. అప్పట్లో కథను పక్కకు పెట్టి ఉట్టి మాటలు వ్రాసిన త్రివిక్రమ్ ను చూసినప్పుడు ఇతడు భవిష్యత్ లో రచయితగా రాణించగలడా అని భయపడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే వ్యక్తి ఇప్పుడు మాటల మాంత్రికుడుగా మారిపోతాడని తాను కలలో కూడ ఊహించలేదు అని సెటైర్లు వేసాడు పోసాని. 

అయితే ఇంత పేరులోకి వచ్చినా ఎక్కడా గర్వం అనేది లేకుండా చేసే పని పై ఏకాగ్రతతో కనిపించే త్రివిక్రమ్ ను చూస్తూ ఉంటే ఒకనాడు తన వద్ద పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ యేనా అన్న అనుమానం తనకు కలుగుతోంది అంటూ మరో కామెంట్ విసిరాడు పోసాని. అయితే అప్పట్లో తాను చెప్పినట్లుగా డైలాగ్స్ వ్రాసిన త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ దర్శకుడుగా మారడంతో త్రివిక్రమ్ చెప్పినట్లుగా తాను నటించే స్థాయిలో మారిపోయాను అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు పోసాని..   



మరింత సమాచారం తెలుసుకోండి: