అనుష్క ‘సైజు జీరో’ కోసం పెంచిన బరువును పూర్తిగా తగ్గించుకుని ‘బాహుబలి 2’ లో దేవసేనగా మెప్పించడానికి రెడీ అయింది అని భావిస్తున్న వారికి మొన్న ‘బాహుబలి’ చైనీస్ వెర్షన్  ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు ‘బాహుబలి’ యూనిట్ తో వచ్చిన అనుష్కను చూసి ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు షాక్ గురి అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇందుకు కారణం. 

అనుష్క ఇంకా లావుగా కనిపిస్తూ ఉండడమే దీనితో అందరి కళ్లు అనుష్క పర్సనాలిటీ పైనే ఉన్నాయి. దీనితో ఇంకా సైజు లు పూర్తిగా తగ్గని అనుష్కను రాజమౌళి దేవసేనగా అందంగా  ‘బాహుబలి 2’ లో ఎలా చూపెడతాడు అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా అనుష్క  మిగిలిపోవడంతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ ఆమె దగ్గరకే  వచ్చేస్తున్నా విషయం తెలిసిందే. 

దీనితో ఆమె రేంజ్ పెరిగి పోవడమే కాకుండా ఆమె పారితోషికం కూడ టాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ రేంజ్ కి కి చేరిపోయింది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి 2’ తో పాటు ‘భాగమతి’ ‘సింగమ్ 3’ చిత్రాల షూటింగ్ లలో పాల్గొన వలసి ఉంది. దీనితో  ఇంకా పూర్తిగా  తగ్గని  ఆమె భారీ పర్సనాలిటీ మారి ఖచ్చితంగా పాత రూపంలోకి వస్తే కాని ఆమె ఆ సినిమాలలో చేస్తున్న పాత్రలకు గుర్తింపు రాదు అన్నది వాస్తవం. 

దీనితో అనుష్క  వెయిట్ ను ఎలా తగ్గించుకుంటుందో అంటూ మీడియా వర్గాలు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. మరికొందరు అయితే ఒక నాటి మహానటి సావిత్రిలా అనుష్క ఇదే అవతారాన్ని కంటిన్యూ చేస్తుందేమో అన్న సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: