సూపర్ స్టార్ కృష్ణ పరిశ్రమలో గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ శ్రీ సినిమాలో నటించారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత కృష్ణ నటించిన ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దర్శకుడు ముప్పలనేని శివ, సూపర్ స్టార్ కృష్ణ, నిర్మాతలు సాయిదీప్‌ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్‌ సిరాజ్‌ పాల్గొన్నారు. 


సూపర్ స్టార్ కృష్ణను మరోసారి తెర మీద చూడలనే కోరిక ఉన్న వారు శ్రీ శ్రీ సినిమాతో సంతృప్తి చెందినట్టే. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే సినిమా ఓవరాల్ గా మంచి అవుట్ పుట్ తెచ్చుకుంది. ఇక సక్సెస్ మీట్లో కృష్ణ మాట్లాడుతూ మరోసారి ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాతో వచ్చినందుకు ఆనదంగా ఉందని.. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చిందని అన్నారు. ఇక సినిమాలో విజయ నిర్మలగారికి తనకు మధ్య వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులు క్లాప్స్ కొడుతున్నారని అన్నారు. 


ఇక సూపర్ స్టార్ లాంటి హీరోను డైరెక్ట్ చేయడం తనకు అదృష్టమని దర్శకుడు ముప్పలనేని శివ అన్నారు. తెలుగు సినిమాలు రిలీజ్ కాని చాలా చోట్ల ఈ సినిమా ఆన్ లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక అమెరికాతో పాటు నెదర్లాండ్స్‌, మొరాకో, ఉగాండా నుండి కృష్ణ గారిని చూపించిన విధానానికి అభిమానులు సంతోషాన్ని వ్యక్త పరిచారని అన్నారు.  


మొత్తానికి కథలో మంచి ఎమోషన్ ఉంది కాబట్టి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇకపోతే నటశేఖరుడి సిని జీవితం 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో శ్రీ శ్రీ సినిమాలో నటించడం గొప్ప విషయం. సినిమాలో నరేష్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా.. ప్రిన్స్ మహేష్ వాయిస్ ఓవర్.. సుధీర్ బాబు గెస్ట్ రోల్ లో అలరించి మెప్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: