జూన్ 2న రిలీజ్ అయిన ''అ ....ఆ '' భారీ వసూళ్ళ ని సాధిస్తూ నితిన్ ని యాభై కోట్ల క్లబ్ లో చేర్చుతూ నితిన్ రేంజ్ ని పెంచింది . నితిన్ , సమంత , రావు రమేష్ ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మార్క్ స్టైల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. ఇది మంచి వసూళ్ళు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చూసిన అనుభూతి ప్రేక్షకుల్లో కలిగినందుకే ఈ విజయం అని చిత్ర యూనిట్ అంటున్నారు.


ఇకపోతే ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వీక్షించి మెచ్చుకోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. అంతే కాక నితిన్ మొదటి నుంచి పవన్ కళ్యాన్ కి పెద్ద ఫ్యాన్ అందుకే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడటానికి మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సం హిట్ సినిమా ఖాతాలో ‘అ..ఆ’ కూడా చేరిపోయింది.   నితిన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ శుక్రవారం మరిన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 27.66 కోట్ల షేర్ ని వసూల్ చేసి భారీ లాభాలను ఆర్జిస్తోంది . తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఇలా ఉన్నాయి . 

నైజాం        - 11.77 కోట్లు (షేర్ )

సీడెడ్          - 3.67 కోట్ల షేర్ 

ఉత్తరాంద్ర      - 3.46 కోట్ల షేర్ 

గుంటూరు      - 2.33 కోట్ల షేర్ 

కృష్ణా             - 1.96 కోట్ల షేర్ 

ఈస్ట్               - 1.99 కోట్ల షేర్

 వెస్ట్                - 1.69 కోట్ల షేర్ 

నెల్లూరు          - 0. 79 కోట్ల షేర్

 మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో 27.66 కోట్ల షేర్ 

మరింత సమాచారం తెలుసుకోండి: