సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమా కలెక్షన్లు వచ్చే వరకు ఎదో ఒక రకంగా పబ్లిసిటి చేస్తూ వస్తున్నారు. ఇక సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివాటిల్లో దుమ్ములేపుతున్నారు. అంతే కాదు సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు నుంచి ప్రమోషన్ వర్క్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే సినిమా ప్రమోషన్లు చాలా వెరైటీ వెరైటీగా చేస్తున్నారు. జనాల్లోకి రావడం హల్ చల్ చేయడం సినిమా గురించి కాస్త ముచ్చట్లు పెట్టడం కామన్ అయ్యింది. కొందరు నటీనటులు ప్రమోషన్‌లో భాగంగా విచిత్ర వేషాలు వేస్తున్నారు. మెకానిక్‌లుగా, కూరగాయల వ్యాపారిగా, ఆటో డ్రైవర్‌గా, బిచ్చగాడిగా ఇలా పలు వేషాలను రియల్ లైఫ్‌లో వేస్తూ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ ను అందిస్తున్నారు.  

ఈ మద్య బాలీవుడ్ సింగర్ సోనూ నిగం రోడ్డు మీదకు వచ్చి పాటలు పాడారు..అయితే అతన్ని ఎవ్వరూ గుర్తు పట్టకపోవడం విశేషం. ఇప్పుడు ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ  ప్రముఖ కన్నడ హాస్య నటుడు శరణ్ బెంగళూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో మారువేషంలో బిక్షాటన చేశాడు.  పవన్ ఒడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నటరాజ సర్వీస్ అనే చిత్ర ప్రమోషన్ కోసం శరణ్ ఈ ఫీట్ చేసాడు. అయితే ఈయనగారి బిక్షాటనలో పెద్ద ట్విస్ట్ జరిగింది..అదేమంటారా..అంతగా రోడ్డుపైకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా తంటాలు పడి పాటలు పాడి బిక్షాటన చేస్తే అయ్యవారికి వచ్చింది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అక్షరాలా రూ.128 రూపాయలు మాత్రమే..దీంతో బిక్కమోఖం వేసుకొని మొత్తాని ప్రమోషన్ అయ్యింది అనిపించుకున్నాడు. అయితే  శరణ్ బిక్షాటన తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌లా స్ప్రెడ్ అయింది. 

ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: