సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు దాటినా పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకోలేక పోయిన హీరో నితిన్ ‘అ..ఆ..’ చిత్రంతో ఆ దాహాన్ని తీర్చుకున్నాడు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సంవత్సరం సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తీశారు..కానీ అది ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు..ఇదే కసితో హీరో నితిన్ తో అ..ఆ.. లాంటి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ కావడంతో భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. దీంతో.. ఈ విజయాన్ని నితిన్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవైపు సక్సెస్‌మీట్‌లలో పాల్గొంటూనే.. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు.

ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు సినిమా ఇండస్ట్రీలో నచ్చిన మంచి డ్యాన్సర్లు ఇద్దరే ఇద్దరని వారే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అన్నారు. అయితే రీసెంగ్ గా మా మూవీస్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూశానని తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఇంత వయసులో కూడా పక్కన యంగ్ హీరోల దిమ్మ తిరిగేలా బెండ్ అవుతు స్టెప్పులేస్తున్న చిరంజీవి చూస్తుంటే ఎప్పటికీ ఆయనకు ఆయనే సాటి అనిపించారని అన్నారు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి స్టెప్పులు యువ హీరోలకు ఎప్పుడు మంచి ఊపునిస్తాయని అన్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..ఈ జనరేషన్‌ హీరోల్లో అతనే బెస్ట్ డ్యాన్సర్ అని కితాబిచ్చాడు. ఈ విధంగా నితిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాట శివ దర్శకత్వంలో జనత గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నారు..ఈ చిత్ర షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఇక మెగాస్టార్ తన 150 వ చిత్రం ‘కత్తిలాంటోడు’ చిత్రం షూటింగ్ త్వరలో జరగబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: