సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేంద్రబింధువుగా నిలిచే రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా చేసుకొని చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలు కేంద్ర మంత్రుల వరకు రాజకీయంగా కామెంట్స్ చేశాడు. సినిమా హీరోలపై ట్వీట్స్ చేయకుండా వర్మ ఉండలేడు. సమాజంలో జరిగే ప్రతి దానిపై అయన సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటాడు. అంతే కాదు ఆ మద్య ఓ మహిళా ఎమ్మెల్య అందంపై కూడా స్పందించి కామెంట్స్ చేయడంతో పెద్ద గందరగోళమే చెలరేగింది.

ఇక పవన్ కళ్యాన్, మహేష్ బాబు ల గురించి కామెంట్స్ చేసి వారి అభిమానుల ఆగ్రహానికి బలైయ్యాడు..ఫేస్ బుక్ లో ఆయన మరణ వార్త వేయగా దానిపై కూడా రివర్స్ కామెంట్స్ చేస్తూ ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తుంది అన్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పై కామెంట్స్ చేస్తూ..అమితా బచ్చన్ చేసిన సినిమాలు రజినీ చేస్తే ప్రేక్షకులు నవ్వుకుంటారని చిరంజీవి, రజినీకాంత్ లు అమితాబ్ ను చూసి చాలా చేర్చుకోవాలని హితబోద చేశాడు.

తాజగా ముంబై కోర్టు వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది..ఆ మద్య గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై ముంబైలోని అంధేరి కోర్టు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై స్పందించి, కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. జూలై 19లోగా వర్మ కోర్టుకు హాజరు కావాలని లేదంటే తన న్యాయవాది ద్వారా స్పందించాలని కోర్టు తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: