ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రియలిస్టిక్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ చేసిన ప్రయత్నాలు మరే హీరోనూ చేయలేదు. సినిమాల్లో డబ్బు సంపాదించుకోవటంతోనే పెద్ద స్టార్ గా మారిపోయాము అనుకునే హీరోల్లా కాకుండా, డబ్బుతోపాటు నిజమైన యాక్టర్ గా నిరూపించుకోవాలని తహతహలాడే యాక్టర్ గా కమల్ హాసన్ నిలిచాడు. తను ఎంతైతే ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడో, అంతకు మించి ఇండస్ట్రీలో పోగొట్టుకున్నాడు.


ఇప్పుడిప్పటే అటువంటి ప్రయత్నాలు నుండి దూరంగా జరిగి, కాస్త డబ్బుని పోగేసుకోవటం నేర్చుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ మరోసారి మనీ గేమ్ ని స్టార్ట్ చేయనున్నారు. కమల్ కొంతకాలం క్రితం 'విశ్వరూపం' అనే సినిమా చేసి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సైతం మంచి కలెక్షన్స్ ని సాధించింది. అయితే ఆ వెంటనే కమల్ హాసన్ విశ్వరూపం సీక్వెల్ ని సైతం రూపొందించాడు.


ఆ మూవీ నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కానీ నిర్మాత అయిన ఆస్కార్ రవిచంద్రన్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులను ఎదుర్కోవటంతో ఈ మూవీ ఇంత కాలం రిలీజ్ కి నోచుకోలేదు. సినిమా బాగుంది, కానీ రిలీజ్ కాలేకపోతుందనేది కమల్ హాసన్ ఆవేధన. దీంతో కమల్ హాసన్ ఇప్పుడు విశ్వరూపం2 ని తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.


ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ రిలీజ్ చేస్తున్నాడు. సినిమా హిట్ అయితే దాదాపు 15 కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. పోతే మాత్రం 5 కోట్ల రూపాయలు గోవింద అని అంటున్నారు. కమల్ ఈ గేమ్ ని ఇప్పటికే స్టార్ట్ చేశారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: