తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో దర్శకుడైన ఇ.వి.వి.సత్యనారాయణ తనయులు ఇద్దరు ఆర్యన్ రాజేష్, నరేష్ లు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. క్రియేటీవ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘అల్లరి’ చిత్రంలో నరేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాపేరునే తన మొదటి పేరుగా పెట్టుకొని అల్లరి నరేష్ గా నవ్వులు కురిపించే కామెడీ హీరోగా సెటిల్ అయ్యాడు. అయితే నరేష్ తో పాటు హీరోగా వచ్చిన ఆర్యన్ రాజేష్ హీరోగా నిలబడలేక పోయారు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందాడు.  రాజేంద్ర ప్రసాద్, సినియర్ నరేష్ లాంటి కామెడీ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఆ తరహా హీరోలు వస్తారా ఉంటారా? అన్న సమయంలో అల్లరి నరేష్ ఆ లోటు భర్తీ చేశారు.

కేవలం కామెడీగానే కాకుండా నేను,గమ్యం,లడ్బుబాబు లాంటి చిత్రాల్లో విభిన్నంగా నటించి మంచి ప్రశంసలు పొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు. గత కొంత కాలంగా నరేష్ కి పెద్ద విజయాలు వరించక పోయినా తన హాస్యంతో ఎప్పటికప్పుడు కొత్త తరహాలో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాడు.

ఆ మద్య వచ్చిన సుడిగాడు చిత్రంతో నరేష్ మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘సెల్ఫీ రాజా’  చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. అల్లు అర్జున్ సరైనోడు చిత్రాల్లో మాంచి సీన్స్ ను ఇమిటేట్ చేయడం తప్ప.. సెల్ఫీ రాజా టీజర్లో చెప్పుకోవడానికి ఏం లేదనిపించడం ఖాయం. టీజర్ పరిస్థితే ఇలా ఉంటే.. సినిమాని కూడా ఇలాగే ఎక్స్ పెక్ట్ చేయచ్చు. అల్లరి నరేష్ కి ఏపీహెరాల్డ్.కామ్ టీమ్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: