స్టైలిష్ స్టార్ రేంజ్ ఏంటో సమ్మర్ లో ఊర మాస్ హిట్ కొట్టిన సరైనోడు సినిమా చూస్తే అందరికి అర్ధమవుతుంది. సమ్మర్ జోష్ తో ఈ సంవత్సరం మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్ని తర్వాత సినిమా హరీష్ శంకర్ తో అంటూ ఒకటే హడావిడి చేశారు. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం హరీష్ శంకర్ బన్ని కోసం సిద్ధంగా లేడని తెలుస్తుంది.


అదేంటి హరీష్ కు ఇదో లక్కీ ఆఫర్ కదా మరి ఎందుకు మిస్ అవుతాడు అంటే.. అల్లు అర్జున్ కు హరీష్ కేవలం లైన్ మాత్రమే చెప్పాడట. లైన్ అద్భుతం అనేసరికి దాని బేస్ చేసుకొని ఓ కథ.. దానిలో చేర్పులు మార్పులు.. డైలాగ్ వర్షన్ ఇలా మొత్తం అవడానికి ఇంకాస్త టైం పడుతుందట. అంతేకాదు మొత్తం కథ పూర్తయ్యాక మెగా కాంపౌండ్ చేసే మార్పులకు కూడా సిద్ధమై ఉండాలి.


సో ఇన్ని జరగాలంటే కనీసం రెండు మూడు నెలలన్నా పడుతుంది. సో అలా బన్నికి హరీష్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఈలోపు అల్లు అర్జున్ వేరే కథలు కూడా వింటున్నాడట. హరీష్ తో సినిమా చేసి వెంటనో ఇక మరో సినిమాకు లైన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కేకేస్తే లింగుస్వామి వచ్చి సినిమా తీసేందుకు రెడీగా ఉన్నాడు.


అయితే తమిళ దర్శకుడు కన్నా ముందు తెలుగు దర్శకుడు అది కాక ఎప్పటినుండో సినిమా అడుగుతున్న హరీష్ కి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అల్లు అర్జున్ ఆలోచన. మరి బన్ని సినిమా అంటే కలక్షన్స్ కేక పెట్టాల్సిందే. మరి అలాంటి కథ కోసం కాస్త వెయిట్ చేసినా తప్పేం లేదు అంటున్నారు అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: