నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఎన్ని గొప్ప సినిమాలున్నా ఆదిత్య 369కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఓ కొత్త ఆలోచనతో చేసిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది. లెజెండరీ డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1991 జూలై18న రిలీజ్ అయ్యింది. అంటే రేపటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సినిమా. 


ఇక ప్రస్తుతం బాలయ్య తన నూరవ సినిమాగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి గొప్ప ప్రయోగానికి నాంధి పలికారు బాలయ్య బాబు. అయితే ముందు వందో సినిమాగా ఆదిత్య 369 సీక్వల్ చేద్దామనే ఆలోచన వచ్చినా అది కుదరలేదు.


బాలయ్య ఆలోచనల్లో ఇంకా ఆదిత్య 369 సీక్వల్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఈ సినిమాలో తన తనయుడిని లీడ్ రోల్ పెట్టి చేసే ఆలోచన చేస్తున్నాడట. ఈ మధ్యనే దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కూడా ఈ మాట చెప్పారు. సో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఆదిత్య 369 సీక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు శాతకర్ణిలో మోక్షజ్ఞ స్పెషల్ అప్పియరెన్స్ ఉందని తెలుస్తుంది.


ఆదిత్య 369 విషయానికొస్తే అప్పట్లోనే గొప్ప సాంకేతిక విధానంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సినిమాకు పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేశారు. ఇంగ్లిష్ రైటర్స్ రాబర్ట్ జెమెకిక్స్, హెచ్.జి వెల్స్ రచించిన టైం మిషిన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసర రావు.   



మరింత సమాచారం తెలుసుకోండి: