బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ పండుగ చేసుకుంటున్నాడు. ఈ మద్య విడుదలైన ‘సుల్తాన్’ చిత్రం విపరీతమైన కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది.  అయితే ఈ మద్య బాలీవుడ్ లో పెద్ద హీరోల చిత్రాలు ఏవీ పోటీ  లేకపోవడంతో ‘సల్తాన్’ మంచి లాభాల బాటతో నడుస్తుంది. ఇక ఈ చిత్రం విడుదలైన గంటల్లోనే నెట్ లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్ ఒకింత బయపడినా అలాంటి వాటిని అన్నింటిని అధిగమించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘సుల్తాన్ ’ చిత్రం  విడుదలైన 12 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల చాలా సంతోషంగా ఉందని అంటున్నారు నిర్మాత.

ప్రస్తుతం వసూళ్లలో భారీ స్థాయిలో అంటే  500 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఐదో సినిమాగా రికార్డు పుటలకెక్కింది.  గతంలో అమీర్ ఖాన్ నటించిన 'పీకే' 792 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా, 'భజరంగీ భాయ్‌ జాన్' 626 కోట్ల రూపాయలతో ద్వితీయ స్థానంలోనూ, 600 కోట్ల రూపాయలతో 'బాహుబలి' మూడో స్థానంలో నిలవగా, 'ధూమ్ 3' 542 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో నిలవగా ఐదో సినిమాగా 500 కోట్లతో 'సుల్తాన్' చేరింది.  ప్రస్తుతం పన్నెండు రోజులకే ఈ రకంగా వస్తే..మూడో వారం ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో అని బాలీవుడ్ వర్గం వారు అంటున్నారు.

ఇక 500 కోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటికే 'భజరంగీ భాయ్‌ జాన్' తో నిలవగా ఇప్పుడు మరో సినిమా ఆయన ఖాతాలోకి వెళ్లడం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  'సుల్తాన్' కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో మిగిలిన సినిమాలను దాటేయడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 'పీకే' రికార్డులను దాటే అవకాశం లేదని వారు చెబుతున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: