సాధారణంగా కొన్ని సినిమాలు చూసి చాలా మంది వాటిలో తమను తాము ఊహించుకోవడం..తమ జీవితంలో జరిగిన సంఘటనలే అని భావించడం వాటి కొన్ని పాత్రల ద్వారా కనెక్ట్ కావడం జరుగుతుంది. కొన్ని ప్రేమ కథా చిత్రాల్లో నిజ జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసినవే కావడం విశేషం. ఇలా సినిమాల ప్రభావం మనిషి జీవితంపై ఖచ్చితంగా పడుతుంది. అయితే దీని వల్ల కొన్ని సార్లు మంచి జరగొచ్చు ఉదాహాణరకు గత సంవత్సం కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ద్వారా చాలా మంది ప్రభావితులయ్యారు..అంతే కాదు గ్రామాలు దత్తత కూడా తీసుకున్నారు. ఆ మద్య హైదరాబాద్ లో ఓ సినిమా చూసి ఓ కుర్రాన్ని కిడ్నాప్ చేసి అన్యాయంగా చంపిన ఘటనలు కూడా ఉన్నాయి.

 తాజాగా బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్, గ్లామర్ క్వీన్ అనుష్క శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం సుల్తాన్.  రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కాగా ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్ర రికార్డులు తిరగరాసింది. విడుదలైన మొదటి వారంలో సుల్తాన్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లతో బాహుబలి రికార్డ్‌ని బ్రేక్ చేసింది. మల్లయోధులుగా సల్మాన్, అనుష్కలు అద్భుతమైన నటన కనబర్చారు. ఈ చిత్రం చూసి ఓ చిన్నారి తన మనసులోని భావాలు రాసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ముంబైకి చెందిన అనన్య మజుందార్ అనే ఏడేళ్ళ చిన్నారి సుల్తాన్ సినిమా చూసి ఈ సినిమా తనకు ఎందుకు నచ్చిందో ఓ లెటర్ ద్వారా వివరించింది. సినిమా చూస్తున్నంత సేపు చాలా భావోద్వేగానికి గురైనట్టు చిన్నారి లెటర్ ద్వారా వివరించింది.  

అయితే ఈ లెటర్ చూసి అనన్య తల్లి దీప్తి మజుందార్ తమ పాప ఆ లెటర్ రాయడానికి గల కారణం తెలియజేసింది. ఇక అనన్యకు క్రీడలంటే వల్లమాలిన అభిమానం..సుల్తాన్ సినిమా తాను చాలా ఎంజాయ్ చేసిందని పోస్ట్‌లో తెలిపింది . చిత్రంలో సుల్తాన్ ఓడిపోయినప్పుడు బాధ పడ్డ అనన్య గెలిచినప్పుడు ఎగిరి గంతేసిందని అనన్య మదర్ వివరించింది. మొత్తానికి అనన్య లెటర్ చూసి సుల్తాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: