అల్లు శిరీష్ , లావణ్య , డైరక్షన్ , మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్అల్లు శిరీష్ , లావణ్య , డైరక్షన్ , మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్కథ , నేరేషన్ ,మొదటి సంగంలోని కొన్ని సీన్స్

ప్రకాశ్ రాజ్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ దేశంలో సంపన్నుల లిస్ట్ లో పదిమందిలో ఒక్కడుగా ఉన్న అతను తన పెద్ద కొడుకు ప్రేమించి ఓ మధ్య తరగతి అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చాడని ఆమెతో ఐదు సంవత్సరాలుగా మాట్లాడడు. ఇక చిన్న కొడుకు శిరీష్ (అల్లు శిరీష్) కూడా అనన్య (లావణ్య త్రిపాఠి)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అనన్య ప్రేమ విషయాన్ని తండ్రితో చెప్పిన శిరీష్ ఆమెను ఓ డబ్బున్న వాడిగా కాకుండా ఓ మాములు వ్యక్తిగా ప్రేమించేలా చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. మరి శిరీష్ ఛాలెంజ్ లో ఎవరు నెగ్గారు..? అనన్య ప్రేమను శిరీష్ గెలుచుకున్నాడా..? మధ్యతరగతి మనుషుల మీద ఉన్న బడా బిజినెస్ మ్యాన్ మనసు మారిందా అన్నది అసలు కథ.

శ్రీరస్తు శుభమస్తు అంటూ జోష్ ఫుల్ గా వచ్చిన అల్లు శిరీష్ ఈ సినిమాలో చేసిన శిరిష్ పర్వాలేదనిపిస్తుంది. అక్కడక్కడ తప్పించి సినిమా మొత్తం శిరీష్ వన్ మ్యాన్ షో చేశాడు. సరదాగా సాగే క్యారక్టర్ లో శిరీష్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక సినిమాకు లావణ్య త్రిపాఠి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. అనన్యగా లావణ్య మరోసారి అదరగొట్టేసింది. ఇక డబ్బున వ్యక్తిగా మధ్యతరగతి మనుషుల మీద ఓ దురాభిప్రాయం ఉన్న క్యారక్టర్ లో ప్రకాశ్ రాజ్ తన అద్భుత నటన కనబరచగా. మరోసారి రావు రమేష్ జగన్నాథ రావుగా లావణ్య తండ్రి పాత్రలో అదరగొట్టేశాడు. ఇక సినిమాలో నటించిన తణికెళ్ల భరణి, రణధీర్, ప్రగతి మంచి నటన కనబరచగా.. ఆలి ఉన్న కొద్ది సేపు కామెడీ పండించాడు. ముఖ్యంగా సీరియస్ పోలీస్ గా సుబ్బరాజు మంచి కామెడీ పడించాడు. 

సినిమా దర్శకుడు పరశురాం అనుకున్న కథ తెరకెక్కించడంలో ఓకే అనిపించుకున్నా.. సినిమా అంత గ్రిప్పింగా నడిపించడంలో విఫలమయ్యాడు. ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ మంచి ఎనర్జీ ఇచ్చాయని చెప్పొచ్చు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది కాకపోతే ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. మణికంథన్ సినిమాటోగ్రఫి కొత్తగా ఉంది. సినిమాకు అవసమైన కలర్ ను కెమెరామన్ చూపించాడు. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిచ్ నెస్ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది.  

మిడిల్ క్లాస్ అమ్మాయిల తల్లిదండ్రులు తమ కూతుళ్లను కోటీశ్వరుడికి ఇచ్చి కట్టబెట్టి ఓవర్ నైట్ లో కోటీశ్వరులవుదామని అనుకుంటారు. ఇదే ఆలోచనలో ఉండే తండ్రి పాత్ర.. ఇక తన మనసుకి నచ్చిన అమ్మాయి తన డబ్బుని చూసి కాదు తన ప్రేమను నమ్మి తనతో రావాలని కోరుకునే ఓ కొడుకు. వీరిద్దరి పందెంతో మొదలయ్యే ఈ సినిమా హీరోయిన్ కు తానో పెద్ద కోటీశ్వరుడి కొడుకను తెలియకుండానే ప్రేమంటూ వెంట పడుతుంటాడు. 


ఇక తన ప్రేమను యాక్సెప్ట్ చేసే టైంకు హీరోయిన్ తండ్రి వచ్చి తన చిన్న నాటి స్నేహితుడికి ఇచ్చి తన పెళ్లి ఫిక్స్ చేస్తానని చెప్పడం. ఈ సందర్భంలో హీరోయిన్ తనను కచ్చితంగా ప్రేమిస్తుంది అనే నమ్మకంతో హీరోయిన్ ఇంటికి పెళ్లి పనులకని వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం హీరో చేయడం. సినిమా కథగా వింటే చాలా సినిమాల్లో వచ్చే పాయింటే అనిపిస్తుంది. అయితే దర్శకుడు పరశురాం టేకింగ్ సినిమాకు మంచి స్కోప్ వచ్చేలా చేసింది. తీసుకున్న పాయింట్ అక్కడక్కడ లాజిక్కులు వదిలేసిన శిరీష్ తో మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు. అల్లు అరవింద్ నిర్మాతగా మంచి అవకాశాన్ని అందుకున్న పరశురాం ప్రతిభ కనబరిచాడని చెప్పాలి.   


మొదటి, రెండవ సినిమాల ఫ్లాప్స్ తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో వచ్చిన శిరీష్ శ్రీరస్తు శుభమస్తుతో కొంతమేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. శిరిష్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అయితే హీరోయిన్ ను కాష్మీర్ లో కాపాడిన తనే తనను ప్రేమించేది అన్న పాయింట్ ఎందుకు దర్శకుడు వదిలేశాడో తెలియదు. ఇక తన ఐడెంటిటీ కోల్పోయా అని హీరో హీరోయిన్ మధ్య వచ్చే మొదటి సగంలోని సీన్స్ కేవలం సినిమాటిక్ గానే ఉంటాయి. 


ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఓ పక్క పెళ్లికి రెడీ అవుతూనే హీరోతో సరసాలు, జోకులు అంతగా వర్క్ అవుట్ అయినట్టు కనిపించవు. ఇక క్లైమాక్స్ లో కూడా అప్పటి దాకా మిడిల్ క్లాస్ పీపుల్స్ మీద ఎంతో కోపం ప్రదర్శించే డబ్బున్న తండ్రి పాత్ర నాలుగు డైలాగులు చెప్పగానే కన్విన్స్ అవడం అంత కనెక్ట్ అయినట్టు అనిపించదు. దేవుడిని డబ్బున్నోళ్లు దగ్గరుండి చూసినా, లేని వాళ్లు దూరం నుండి చూసినా ఆయన మాత్రం అందరిని ఒకేలా చూస్తాడు అన్న డైలాగ్ ఒకటి క్లాప్స్ కొట్టేలా చేస్తుంది. సినిమా దాదాపు బొమ్మరిల్లు వాసన చాలా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఇంటి గేటు దగ్గర హీరో వెయిట్ చేస్తున్న సీన్ బొమ్మరిల్లు కాపీలా ఉంటుంది. ఇక ముగింపు కూడా యాజిటీజ్ దించేశాడని చెప్పాలి.   


మెగా అభిమానులకు, అల్లు ఫ్యాన్స్ కు నచ్చే సినిమాగా శ్రీరస్తు శుభమస్తు ఉంటుంది. సరదాగా సినిమా చూసే వారికి ఇదో టైం పాస్ మూవీ అవుతుంది తప్ప కచ్చితంగా చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పలేం.

Allu Sirish,Lavanya Tripathi,Parasuram,Allu Aravind,S. Thamanబొమ్మరిల్లు దారిలో అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు'

మరింత సమాచారం తెలుసుకోండి: