బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలం నుంచి లిప్ లాక్ సన్నివేశాలు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే..అయితే ఇలాంటి సన్నివేశాలు పెద్ద హీరోలు పెద్దగా ఇష్టం చూపకపోయినా..బీ గ్రేడ్ చిత్రాల్లో మాత్రం విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ మద్య వస్తున్న కొన్ని చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఏకంగా రెండు మూడు నిముషాల వరకు కంటిన్యూ చేయడం చూస్తున్నారు..ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే కుర్రకారుకి మతులు పోతున్నాయి. అయితే ఇలాంటి ముద్దు సీన్లు డోస్ ఎక్కువగా ఉంటే మాత్రం సెన్సార్ జోక్యం చేసుకొని చాలా వరకు కట్ చేయడం చూస్తుంటాం.  కానీ మొహెంజొదారో మూవీకి మాత్రం ఇలాంటి కొన్ని పెదవి చుంభన సన్నివేశాల డోస్ బాగానే ఉండటంతో మొదట అవన్నీ కట్ చేస్తారని భావించారట.  

మొత్తానికి మొహెంజొదారో మూవీకి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. చివరకు మూడు లిప్ లాక్ సీన్స్ కు సైతం ఎలాంటి కత్తెరలు పడకుండా U/A సర్టిఫికెట్ రావడం కూడా గ్రేట్ అంటున్నారు.  100 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ గా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతా రెడీ అయిన ఈ చిత్రం  ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పురాతన చరిత్రకు అద్దంపట్టే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారట. హిస్టరీ నేపథ్యం సినిమా కావడంతో మూడు లిప్ లాక్ సీన్స్ అవసరం ఏర్పడింది. కష్టపడి ఇలాంటి సీన్స్ తెరకెక్కించినా ఫైనల్ గా సెన్సార్ చేతిలో కటింగ్ పడుతుందని యూనిట్ సభ్యులు భావించారు.


కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు తగ్గట్టుగా ఇలాంటి సన్నివేశాలు చేయడంలో తప్పేముందని పూజా హెగ్డే చెప్పిందట.ఇక ముద్దు సీన్ల విషయంలో ఫిల్మ్ మేకర్స్- సెన్సార్ బోర్డు మధ్య పెద్ద దుమారం చెలరేగింది. జేమ్స్ బాండ్ సినిమా మొదలు తమాషా , దో లబ్జోంకీ కహానీ వంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. ఇటీవల ఉడ్తా పంజాబ్ ఫిల్మ్ రిలీజ్ టైమ్ లో సెన్సార్ బోర్డ్ సభ్యుల తీరుపై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   అంతే కాదు ఆ మద్య  ఉడ్తా పంజాబ్ విషయంలో కూడా ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: