“గుడి ఎనకా నా సామి గుర్రమెక్కి......గుడిలోన నా సామి కొలువై....”

“మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు లగ్గ మెప్పుడ్రా మామా అంటే  ...”

“కొప్పుచూడు కొప్పందం చూడు… మగడా… నే మునుపటివలనే లేనా!.....”

“జ్యొతిలక్ష్మి చీర కట్టింది...ఆ చీరకే సిగ్గేసింది.....”

“నీవు గంట మరిదివా.....నేను వాడ వదిననే....”


 

పై సినీ గేయాలు విన్నవారికి, చూసినవారికి జ్యొతిలక్ష్మి అంటే ఒక సుమధుర సమ్మోహనం, మన్మధబాణం, రతీదేవి మేని విరుపు, ఇంద్రచాపం, ప్రకృతిలోని మెరుపుల మరకలు, ఇరు తనువుల పెనవేతనుండి ద్రవించిన స్వేదం లోని సుగంధం అనుభ్హూతినినేకాదు, కనులు మూసుకుంటే మనోవేదికపై నృత్యం చేస్తాయి.


 

ఈ తరానికి తెలియని సుమనోహర రుచిర సుందర స్వప్నం. శృంగారానికి సింగారం చేర్చి చేసిన మన్మధ ఫలంకం,  రసిక హృదయ శృంగార శ్వేతాశ్వాన్ని తనివి తీరా అధిరోహించా లనుకోక పోతే వాడు మగటిమి ఉన్న మగాడే కాదు.

 


యువ హృదయాల గిలిగింత ..ముది హృదయాల చక్కలిగింత.... జ్యొతిలక్ష్మి కన్నుమూసా రంటే ఈ మనసులు కొన్ని క్షణాలు మూగబోయాయి. ప్రేక్షక హృదయ రసిక రస వాహిని ఒక్క క్షణం ఆగిపోయింది. వేగంగా పరుగెత్తే గంగోత్రి మందాకినైంది. ఆమెను తీసుకెళ్ళిన విధాతపై కోపగించిన హృదయాల కన్నీరు అలకనందై కొనసాగుతుంది.

 


మొత్తం భారతావనిలోనే అత్యుత్తమ ఐటం నృత్యకారిణులు జ్యొతిలక్ష్మి, జయమాలిని, సిల్క్-స్మిత, హలం, హెలెన్ ఇలా కొద్దిమందే కన్నులు మూసినా ఓతరం హృదయాలను మత్తెక్కించారు. కనులు మూసినా కనులు తెరిసినా కనువిందుచేసే ఆ రూపం వెండి తెరపైనే కాదు మనస్సనే తెరపై ప్రేక్షకుణ్ణి గిలి గింతలు పెట్టటం మానలేదు. తీయని గాయాల్తో ఒకతరం విరహవేదనకు గురిచేసిన ఆ రారాజ్ఞి రసిక ప్రియులను వదలి తిరిగిరాని సుదూర తీరాలకు వెళ్ళిపోయారు...అక్కడ తన రసిక రాజ్యాన్ని ఏలనున్నారను కుంటా!


 

ఆమె చీరకడితేనే యువ హృదయాలు విలపించాయి..విరహించాయి. ఆమె మరణించిం దంటేనే వారి హృదయ వీణలు మూగపోయాయి నేడు. నేడు మెగా, మైటీ, సూపర్ హేరో లకు ఆస్థాయి తెచ్చిపెట్టిన లావణ్య లలామ జ్యొతిలక్మియే. నిర్మాతలకు ఈ లలని ధనకనకాల వర్షం. దర్శకులు సినీ నిర్మాణములో విఫలమైనా, ఆమె నృత్యం చాలు వరాల మూట లందించటానికి. ఆమె పాటకోసమే థియెటర్లకు యువ పాదాలు పరుగెత్తాయి ఎందుకో తెలుసా! మాటలు ఆమె మేనిపై తెనెలూరించేవి. పాటలు పరువాలు చిందించేవి. అర్ధాలు అధరాలను పంచేవి. కన్నుల్లో వేడి మేనుల్లోకి తెచ్చిన సురలోక సౌందర్యం నిద్ర రానివ్వని అనుభూతికోసం అనుభవం కోసం. శృంగార సౌందర్య రసవాహినిని నయాగరాలా థియేటర్లలో ప్రవహింపజేసిన సుమధుర నాట్య రసవీణ జ్యొతిలక్ష్మి.

 


తమిళనాడు అయ్యంగార్ల కుటుంబములో 1963 సంవత్సరములో  ఎనిమిదిమంది సంతానములో పెద్దదిగా జన్మించిన జ్యొతిలక్ష్మి నాట్యకళాకారిణిగా జగగ్గేగీయమానం గా వెలిగింది. తాను తన ప్రభతగ్గే రోజుల్లోనే తన ఎనిమిదవ సోదరి మహోన్నత అందాలరాసి జయమాలినిని దక్షిణ భారత సినీ రంగానికి చేరువచేసింది. 

నేడు 09.08.2016 ఒక వారం రోజులు హాస్పిటల్లో బ్లడ్ కాన్సర్ తో మరణించారు. అమె ఇప్పుడు ఇంకా మూడుసినిమాల్లో కారెక్టర్ రోల్స్ చేస్తూనే ఉన్నారు. టెలివిజన్ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటూ తన కోరిక మరణించేవరకు నటిస్తాననే తీర్చుకున్నారు. 5 సంవతసరాల వయసులోనే నట జీవితం ప్రారంబించిన ఈమె అర్ధశతాబ్ధం సినిరంగానికి చిరస్మరణీయ సెవలందించారు.

ఆమే స్మృతిలో ఒక్క క్షణం......

(సశేషం)


మరింత సమాచారం తెలుసుకోండి: