తెలుగులో పుట్టింటి పట్టుచీర, మామగారు,ఎర్రమందారం, బ్రహ్మచారి మొగుడు లాంటి సినిమాల్లో నటించిన మంచి తెలుగింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న కన్నడ నటి యమున.  హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత వచ్చిన హీరోయిన్లు గ్లామర్ తరహా పాత్రల్లో నటిస్తూ దూసుకెళ్లారు. తర్వాత యమున సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది..బుల్లితెరలో ఈటీవీలో ప్రసారమయ్యే 'అన్వేషణ' సీరియల్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరోసారి బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత కొంత కాలం మళ్లీ కనుమరుగైంది యమున.  ఆమె తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఒక వార్త తెలుగ, కన్నడ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారిపోయింది.

 2011లో బెంగుళూరులోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఈ వార్త అప్పట్లో మీడియా పెద్దగా ప్రచారంలో లేకపోవడం పెద్ద ఇష్యూ కాలేదు కానీ అప్పట్లో యమున పై మాత్రం రక రకాల రూమర్లు బాగా పుట్టుకొచ్చాయి.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యమున ఆరోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నీడలా వెంటాడుతుందని అసలు తనకీ ఆ హోటీక్ కి ఎలాంటి సంబంధం లేకున్నా తనపై లేని పోని అభాండాలు వేశారని చెబుతుంది. తాను వెళ్లింది సిసిపీ ఆఫీస్ కి వెళ్లానని అంతే కానీ ఐటీసీ హోటల్ కి వెళ్లలేదు అని ఖచ్చితంగా చెబుతుంది.

అయితే ఆ రూమర్ వచ్చిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు దీనివల్ల తన పిల్లలపై కనీసం జాలితో అయిన తనపై పడ్డ మచ్చ చెరిగిపోతుందని భావించానని అంతే కాదు ఆస్తులు నా పిల్లలపై రాసి నిజంగా చనిపోవాలని డిసైడ్ అయ్యానని కానీ భగవంతుడు తన పిల్లల కోసం తనని బతికించడాని మనోధైర్యాన్ని ఇచ్చాడని అంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: