జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా బాద్ షా. ఈ చిత్రం గురించి అటు నందమూరి అభిమానులు, ఇటు చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా, బాద్ షా చిత్రం గురించి ఒక ఆసక్తికరమై విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తాడట.  బాద్ షా చిత్రంలో  మాఫియా డాన్ గాను, పల్లెటూరి యువకుడిగాను, పోలీస్ ఆఫీసర్ గాను  జూనియర్ ఎన్టీఆర్ దర్శనమిస్తాడట. ఈ మూడు పాత్రలను దర్శకుడు శ్రీనువైట్ల అద్భుతంగా డిజైన్ చేయగా, సినీ అభిమానుల కళ్ళు చెదిరే విధంగా మన యంగ్ టైగర్ ఈ మూడు పాత్రలను రక్తికట్టించాడట.   బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: