తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాల భామ సమంత. ఈ చిత్రంలో అక్కినేని తనయుడు అక్కినేని నాగ చైతన్య  హీరోగా మంచి మార్కులే కొట్టారు. అప్పటి నుంచి సమంత, చైతూ మద్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అనే వారు..తర్వా ఆటో నగర్ సూర్య, మనం చిత్రంలో ఈ జంట నటించారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారన్న సంగతి సమంత ట్విట్ చేసే వరకు తెలియలేదు. ఆ మద్య తాను తెలుగు యువ హీరోతో పీకల్లోతుల్లో ప్రేమలో మునిగిపోయానని అంతే కాదు ఆ హీరో తల్లిదండ్రులు కూడా మంచి నటులే అని ట్విట్ చేయడంతో ఈ అమ్మడి ప్రేమ సంగతి బయటకు వచ్చింది.

అప్పటి నుంచి ఈ విషయం కాస్త బయట టాం టాం కావడం నాగార్జున, అమలు స్పందించి చైతూ, సమంతల పెళ్లి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంతే కాదు సమంతకు వ్యవహారం పట్ల నాగ్ కాస్త సీరియస్ కావడం అన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అప్పటి నుంచి చైతూ, సమంతలు సీక్రెట్ గానే తిరిగేవారు..మొట్ట మొదటి సారిగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకలో అక్కినేని కుటుంబం హంగామా చేశారు. ఈ సందర్భంగా  నాగచైతన్య - సమంత జంటగా రావడంతో  ఒక్కసారిగా ఆ వేడుకకే కళ వచ్చింది దాంతో అక్కడున్న వాళ్ళంతా ఈ జంట ని చూడటానికి తెగ ముచ్చట పడ్డారు.  Nagarjuna introduced Samantha as Daughter-in-Law to Sachin Tendulkar
ఇన్నాళ్ళు ఈ జంట అంతగా కనిపించింది లేదు కానీ ఈ ఇద్దరి మద్య ఏదో ఉందని త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తొలిసారిగా అధికారికంగా అందరి ముందుకు ఇలా వచ్చారు దాంతో ఓ పెళ్లి వేడుకలో కనిపించిన ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు . ఇక ఈ ఇద్దరూ ఆ పెళ్లి వేడుక ఎప్పుడు అనేది స్వయంగా ప్రకటించాల్సి ఉంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: