వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచుగా వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్... మరోసారి తన వ్యాఖ్యలతో వివాదాలు రేపుతోంది. అంతేకాదు. రెచ్చి పోయే డ్రెస్లతో కుర్రకారును వెర్రెక్కిస్తోంది. రాఖీ సావంత్ తన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకుందనే చెప్పాలి. తన చేతిలో సినిమాలు లేకున్నా..ఏదో ఓ కామెంట్ చేయడం, పబ్లిసిటీ కొట్టేయడం కామన్గా మారిపోయింది. రాఖీ సావంత్ పబ్లిసిటీ కోసం రకరకాల జిమ్మిక్కులు చేస్తోందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటారు.

Image result for rakhi sawant hot

రాఖీ ప్రతిసారి ఎవరిపైనో కామెంట్ చేసి తాను వార్తల్లో వ్యక్తిగా నిలిచేది. కానీ ఈ సారి తన రూట్ మార్చింది. తనపై తానే కామెంట్ చేసుకుని పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించి నలుగురిలో పరువు తీసుకుంది. రీసెంట్గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ... ''నేను నా బ్రెస్ట్లకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని సైజ్లను పెంచుకున్నాను. అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని అమ్మడు.. ఇదేమంత పెద్ద విషయం కాదనీ, హాలీవుడ్తో పాటు బాలీవుడ్ లోనూ ఇది సర్వ సాధరణమని చెప్పుకొచ్చింది.

Image result for rakhi sawant hot

అంతటితో ఆగని రాఖీ.. మా బాలీవుడ్ సినీ తారల బాడిల్లో ఉన్న ప్లాస్టిక్ని కలెక్ట్ చేయటం మొదలెడితే.. మినిమం మూడు ట్రక్లు నిండిపోతాయని వ్యాఖ్యానించింది. అయితే ఇదంతా తాను నిజాయితీగా ఉండాలని చెప్తున్నానని, చాలామంది అలా చెప్పరంటూ తనకు తనే పొగుడుకుంది. అలాగే బ్రెస్ట్లకు సర్జరీలు చేయించుకోవటం చాలా కాలంగా సినీ తారలకు వస్తున్న ఆచారమేనని అసలు గుట్టు బయటపెట్టింది రాఖీ సావంత్.

Image result for rakhi sawant hot

ఇది ఇలా ఉంటే.. రాఖీ మరో అగ్గి కూడా రాజేసింది. ఇటీవల చికాగోలో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ పార్టీలో రాఖీ సావంత్ వేసుకొచ్చిన డ్రెస్ అందరూ ఆమెవైపే చూసేలా ఉంది. సాధారణంగానే రాఖీ చిట్టి పొట్టి డ్రెస్లతో అందరూ తనవైపు చూసేలా అందాలను ఆరబోస్తుంటుంది... అయితే ఈ సారి ప్రీ ఇండిపెండెన్స్ పార్టీకి వేసుకొచ్చిన ఆ డ్రెస్ నిండా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలే ఉన్నాయి. ఆమె ఎద భాగంతో పాటు బ్యాక్ వైపు కూడా మోడీ బొమ్మలే దర్శనమివ్వడంతో ఈమె మరోసారి మీడియాకు ఎక్కింది. ఈ డ్రెస్లో రాఖీని చూసిన వారంతా ఇదేమి చోద్యమని నోరెళ్ల బెట్టారని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: