దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న కళ్యాణ్ రాజ్ ‘ఇజం’ కు విడుదల కాకుండానే సమస్యలు ప్రారంభం అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాకు పెట్టిన టైటిల్ రీత్యా అదే విధంగా ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ లుక్ రీత్యా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమాకు పూరి ఖర్చు పెట్టిన భారీ బడ్జెట్ 26 కోట్లు ఇప్పుడు సమస్యగా మారింది అని టాక్.

సినిమా హీరో రేంజ్ బట్టి సినిమా నిర్మాణానికి ఖర్చు చేయడమో చేయించడమో జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా కళ్యాణ్ రామ్ ‘ఇజం’ వ్యవహారంలో జరిగింది అని అంటున్నారు.  కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇంత వరకు  ‘పటాస్’  మాత్రమే పెద్ద హిట్.  దీని బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో జరిగితే ఆ సినిమాకు 25  కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చాయి.  

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ చేస్తున్న ‘ఇజం’ కు 26 కోట్లు ఖర్చు చేయడంతో ఆ సినిమాను భారీ రేట్లకు అమ్మ వలిసిన పరిస్థితులు ఏర్పడటంతో ఆ వార్తలను విని బయ్యర్స్ బెదిరిపోయి పారిపోతున్నట్లు టాక్.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం  పూరి జగన్నాధ్  ఈ సినిమాకు 8 కోట్లుపారితోషికం తీసుకున్నాడు అని అంటున్నారు. 

దీనితో పాటు హై ప్రొడక్షన్ కాస్ట్ కూడ కలవడంతో సినిమా ఖర్చు 26 కోట్లకు దాటిపోయినట్లు తెలుస్తోంది. దీనితో దానికి తగ్గట్టే బయ్యర్లకు నిర్మాతలు రేట్లు చెబుతున్న నేపధ్యంలో పూరి ట్రాక్ రికార్డు తెలిసి కళ్యాణ్ రామ్ రేంజ్ తెలిసి బయ్యర్లు అటువేపు కన్నెత్తి కూడ చూడటం లేదట.  

దీనితో కాస్త బడ్జెట్ కంట్రోల్ లో వెళ్లివుంటే ఈపరిస్థితి వచ్చి వుండేది కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  బడా హీరోల భారీ సినిమాల స్థాయిలో ఈ సినిమాను  తీసేయడంతో ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు.  ఇప్పటికే కళ్యాణ్ రామ్ రవితేజాతో తీసిన ‘కిక్ 2’ భారీ ఫ్లాప్ అయినప్పుడు ఎన్టీఆర్  తన అన్న కోసం మాట సాయం  చేతి సహాయం చేయ వలిసిన పరిస్థితి గతంలో ఏర్పడింది. 

ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్తి కళ్యాణ్ రామ్ కు ఏర్పడితే జూనియర్ ఎంత వరకు సహకరిస్థాడు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.  ఏమైనా కళ్యాణ్ రామ్ కు ‘ఇజం’ సినిమా కష్టాలు తెచ్చిపెట్టాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: