తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది. గత సంవత్సరం టెంపర్ చిత్రంతో విజయాన్ని మొదలు పెట్టి ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో ఈ మద్య రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మరో ఘన విజయాన్ని తన సొంతం చేసుకొని హ్యాట్రిక్ సాధించాడు. ఇక మిర్చి చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల శివ ఆ చిత్రం మంచి విజయం సాధించింది..ఆ తర్వాత మహేష్ బాబుతో  ‘శ్రీమంతుడు’ చిత్రంతో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తాజాగా జనతా గ్యారేజ్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని దర్శకుడిగా హ్యాట్రిక్ సాధించాడు. ఈ చిత్రం రిలీజ్ రోజున యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత రోజు నుంచి పాజిటీవ్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.

Image result for janatha garage stills

ఇక గత రెండు రోజుల నుంచి హాలిడేస్ రావడంతో ఈ చిత్రం కలెక్షన్లకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక సినిమా విజయం సాధించడంతో సక్సెస్  మీట్ కూడా పెట్టారు. మొత్తానికి ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా మూడు చిత్రాలు విజయవంతం కావడంతో నెంబర్ వన్ రేస్ లో ఉన్నాడు. ఒక్క ప్రీమియర్ షోలతోనే  హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా వసూల్ చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన నెంబర్ వన్ చిత్రంగా ఓవరాల్ గా తెలుగు చిత్రాల్లో నెంబర్ త్రీ గా నిలిచింది జనతా గ్యారేజ్. యు ఎస్ లో 156 స్క్రీన్ లలో జనతా గ్యారేజ్ షోస్ పడగా $ 560,509 కలెక్షన్ల ని రాబట్టింది జనతా గ్యారేజ్.


            Janatha Garage Four Days Collections

ఎన్టీఆర్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడం తో పాటు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకేక్కడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘గ్యారేజ్’  రూ.20.81 మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ తర్వాత రూ.32 కోట్లకుపైగా కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్ర పోషించగా.. ఉన్నిముకుందన్, సచిన్ ఖేడ్‌కర్ విలన్లుగా నటించారు. 

Image result for janatha garage stills

ఏరీయా వైజ్ కలెక్షన్లు :


నైజాం : 11.6 కోట్లు


సీడెడ్ : 6.46 కోట్లు


ఉత్తరాంధ్ర : 4.10 కోట్లు


ఈస్ట్ : 3.12 కోట్లు


వెస్ట్ : 2.67 కోట్లు


కృష్ణ : 2.73 కోట్లు


గుంటూరు : 3.84 కోట్లు


నెల్లూరు : 1.33 కోట్లు


ఏపీ +నైజాం : 35.85 కోట్లు


మొత్తం వరల్డ్ వైజ్ కలెక్షన్లు : 50.5 కోట్లు అంచనా


మరింత సమాచారం తెలుసుకోండి: