టాలీవుడ్ లో ప్రతిభావంతమైన దర్శకులకు కొదవలేదు. అయితే తమ చిత్రాల టైటిల్స్ తో ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే దర్శకులు కొంతమందే ఉన్నారు. ఈ జనరేషన్ లో దర్శకుడు వంశీ చిత్రాల టైటిల్స్ ఆకట్టుకునే విధంగా ఉండేవి. తరువాత టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్ తన చిత్రాల టైటిల్స్ తో అందరీ దృష్టిని తనవైపు తిప్పుకునే వాడు. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ ఈ జాబితాలోకే వస్తాయి. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా తన సినిమాలకు ఆకట్టుకునే టైటిల్స్ పెట్టడంలో దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల తన తాజా సినిమాకు నిర్ణయించిన టైటిల్ ఇప్పుడు అందరీ ఆకర్షిస్తుంది. తన కొత్త సినిమాకు అతను ‘గొల్లభామ’ అనే టైటిల్ ఖరారు చేశాడు. ఈ టైటిల్ కు మంచి స్పందన వస్తుంది. శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’. టైటిల్ తోనే ఆకట్టుకున్న సినిమా ఇది. ఇక అతను రూపొందించిన రెండవ సినిమా గురించే తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే అచ్చమైన టైటిల్ తో రెండవ సారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సృష్టిస్తున్న సంచలనం ఆగకముందే ముందే శ్రీకాంత్ అడ్డాల 3వ చిత్రం గురించి వార్తలు బయటకు వచ్చాయి. ‘గొల్లభామ’ పేరుతో శ్రీకాంత్ అడ్డాల రూపొందించే మూడవ చిత్రంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరో నటించనున్నాడు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ ఈ ‘గొల్లభామ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ సినిమాను గీతా అర్ట్స్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: