‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫబ్క్షన్ కు దూరంగా ఉన్న సమంత తిరిగి మధ్యలో తన మనసు మార్చుకుని ఈసినిమా విడుదలకు ముందు ప్రసారం అయిన ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో బాగా సందడి చేసింది.  అయితే ఈ సినిమా విడుదలై కలక్షన్స్ సునామిని సృష్టిస్తున్న నేపధ్యంలో వినాయక చవితి రోజున ఒక ఛానల్ ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఈ సినిమా ముఖ్య యూనిట్ అంతా వచ్చినా సమంత రాకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

అయితే ఈ కార్యక్రమానికి సమంతను రమ్మని ఎన్ని సార్లు పిలిచినా ఆమె స్పందించక పోవడంతో ఇక విధిలేక నిత్యామీనన్ తో వినాయకచవితి పూజ చేసి సరిపెట్టారు.  అయితే ఆ కార్యక్రమం రికార్డింగ్ జరిగిన రోజున సమంత భాగ్యనగరంలో ఉండి కూడ రాకపోవడానికి గల కారణం ఈసినిమాలో ప్రత్యేక ఐటమ్ సాంగ్ చేసిన కాజల్ అని అంటున్నారు.

ఈసినిమాలో సమంత పాత్రను అర్ధంతరంగా కొరటాల శివ ఈ సినిమా ఎడిటింగ్ లో కట్ చేయడం సమంతకు ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది అని అంటున్నారు.  మొదట్లో ఈ సినిమా కథను కొరటాల సమంతకు చెప్పినప్పుడు ఈ విధంగా ఈసినిమాలో సమంత పాత్ర కట్ అయిపోతుంది అన్న విషయం సమంత పసిగట్టలేక పోయింది అన్న బార్తలు ఉన్నాయి.  

దీనికితోడు ఈసినిమాలో యాపిల్ బ్యూటీ అంటూ జూనియర్ తో తాను రొమాన్స్ చేస్తూ ఒక పాటలో నటించినా ఆ పాట కంటే ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో వచ్చే కాజల్ ఐటమ్ సాంగ్ ‘పక్కా లోకల్’ ఆడియో రేటింగ్స్ లో కూడ టాప్ వన్ స్థానంలో వచ్చింది.  దీనితో పాటు తన పాత్ర గురించి కన్నా ఎక్కువమంది ‘జనతా గ్యారేజ్’ లోని కాజల్ ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకోవడం సమంత కు మరింత షాక్ ఇచ్చింది అని టాక్.

ఈ పరిస్థుతులకు తోడు కాజల్ ఐటమ్ సాంగ్ క్లిపింగ్స్ ను ‘జనతా గ్యారేజ్’ లేటెస్ట్ ప్రమోషన్ యాడ్స్ లో విపరీతంగా ఉపయోగిస్తూ ఉండటంతో ఈ సినిమాలో హీరోయిన్ గా తన కంటే కాజల్  ఎక్కువ పాపులారిటీ లోకి వచ్చేసిందని సమంత తెగ మధన పడిపోతున్నట్లు టాక్.  దీనితో కోపగించిన సమంత ఈ వారంలో వైజాగ్ లో జరగబోతున్న ‘జనతా గ్యారేజ్’ సక్సస్ మీట్ కు కూడ డుమ్మా కొడుతుందా అన్న ప్రచారం ఊపు అందుకుంది. 

ఇది ఇలా ఉండగా కాజల్ ఈ సంవత్సరం పవన్ మహేష్ లతో నటించిన భారీ సినిమాలు భారీ ఫ్లాప్ లుగా మారినా కేవలం మూడు నిముషాల ఐటమ్ సాంగ్ చేసిన ‘జనతా గ్యారేజ్’ కాజల్ కు తిరిగి కెరియర్ పరంగా పెద్ద బ్రేక్ ఇచ్చింది అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: