పేరు ఉన్న నటీనటులకు దర్శక, నిర్మాతలు భయపడుతుంటారని, వారు చెప్పినట్లు వింటుంటారని చాలా మంది భావిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా తెలుగు పరిశ్రమలో జరిగింది. అదీ కూడా భానుమతి విషయంలో... 1954 సంవత్సరంలో విడుదలైన ‘అగ్గిరాముడు’ అనే సినిమాలో భానుమతి కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో ఒక షెడ్యూల్ ను కోయంబత్తూరు లో షూటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో భానుమతి ఇచ్చిన తేదీలలోనే షూటింగ్ జరుగుతుండగా.. మధ్యలో వెళ్లిపోతానని భానుమతి పెచీ పెట్టారట. దీంతో చిత్ర దర్శక నిర్మాత శ్రీరాములు నాయుడు ‘అమ్మ! ఇంకా చాలా పని ఉంది. ఈ షెడ్యూల్ లో పూర్తి కావాలి. ఇప్పుడు మీరు వెళ్లిపోతే మళ్లీ అందర్నీ డేట్స్ నాకు దొరకవు’ అని చెప్పారు. ‘అవన్నీ తరువాత చూసుకుందాం. నన్ను పంపించేయండి. లేకపోతే నేనే వెళతాను’ అని భానుమతి మెండిగా మాట్లాడారు. దీంతో శ్రీరాములు నాయుడు ఇంకా మెండిగా ‘ సరే, వెళ్లండి. ఎలా వెళతారో చూస్తాను. గేట్లు మూయించేస్తాను. లోపలి కార్లు బయటికి వెళ్లవు. బయటి నుంచి కార్లు లోపలికి రావు. ఇక్కడ పని పూర్తయిన తరువాతనే గేట్లు తెరుచుకుంటాయి’ అని చెప్పారు. దీంతో భానుమతి గత్యంతరం లేక షూటింగ్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి తన సహాయ సహకారాలను అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: