సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి చాన్స్ వస్తే చాలు అనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే అలా చాన్స్ వచ్చినా కూడా ఏమాత్రం బ్రేక్ రాకుండా అస్సలు గుర్తింపు రాకుండా ఉన్నావారు కూడా చాలా మంది ఉన్నారు. కొంత మంది ఇండస్ట్రీలోకి ఏదో రకంగా ఎంట్రీ ఇచ్చి అనుకోని చాన్సులు దక్కించుకొని మంచి హీరోలు, డైరెక్టర్లు గా గుర్తింపు పొందిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ,నానీ, రాజ్ తరుణ్ లాంటి వారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి సినిమా హీరోలుగా మారారు. ఇక రచయితగా ఎంట్రీ ఇచ్చి మంచి డైరెక్టర్లుగా మారిన వారిలో కొరటాల శివ ఒకరు. మిర్చి,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించి టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ లీస్టు లో చేరిపోయారు.
Image result for mirchi movie
బ‌హుశా టాలీవుడ్ లో ఇలాంటి అరుదైన ఫీట్ ను సాధించిన ద‌ర్శ‌కుడు ఆయ‌నొక్క‌డేనేమో. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్ని  రికార్డు క‌లెక్ష‌న్స్ తో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ ద‌ర్శ‌కుడి క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.  దీంతో ఆయన వెంట ఇప్పుడు టాప్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారు.
Image result for movie srimanthudu
మిర్చి సినిమా హిట్ అయిన తర్వాత కొరటాల రెమ్యూనరేషన్ 5 కోట్ల వరకు ఉండేది..ఇక శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత ఆయన తదుపరి చిత్రానికి రెమ్యూనరేషన్ ఒక్కసారే పెంచారట. ఏకంగా 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అంత కాకపోయినా 12 కోట్లకు మాత్రం తగ్గే పరిస్థితిలో లేరని సమాచారం.  దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత ఈ దర్శకుడు కూడా తూ..చా.. తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తుంది. 

Image result for movie janatha garage


మరింత సమాచారం తెలుసుకోండి: