విజయ్ మాల్యాను ఎలాగైనా మన ఇండియాకు రప్పించాలని మనదేశంలోని అనేక దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నా వాటిని తప్పించుకుని లండన్ లో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను మెగా స్టార్ చిరంజీవి బాగా ఉపయోగించుకోబోతున్నాడు.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ లో విలన్ పాత్రను విజయ్ మాల్యా తరహాలో డిజైన్ చేసినట్లు టాక్. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే స్వయంగా వెల్లడించాడు.

తమిళంలో నిర్మించిన ‘కత్తి’ లో నీల్ నితిన్ ముకేష్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.అయితే దర్శకుడు వినాయక్ ‘ఖైదీ నెంబర్ 150’ లో విలన్ పాత్రను విజయ్ మాల్యా గుర్తుకు వచ్చే విధంగా డిజైన్ చేయడమే కాకుండా అతడి డ్రెస్ లుక్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ ని విలన్ పాత్ర చేస్తున్న తరుణ్ అరోరా తో చేయిస్తున్నట్లు వార్తలు వస్తూ న్నాయి. 

అయితే చిరూ తరుణ్ అరోరా ల కాంబినేషన్ లో  ఇంకా ఎక్కువ సన్నివేశాలు తీయని నేపధ్యంలో రేపటి నుంచి వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలు తీసే షెడ్యూల్ ప్రారభం అవుతున్నట్లు తెలుస్తోంది.  అయితే ‘కత్తి’ సినిమాలో విలన్ క్యారక్టర్ చాలా పోష్ గా ఉండే ఒక బిజినెస్ మ్యాన్. కాకపోతే తమిళంలో మాత్రం ఎవ్వరినీ విమర్శలు చేసే దిశగా ఆ క్యారెక్టర్ ను మురుగ దాస్ రూపొందించలేదు.  కాని తెలుగులో మాత్రం ఏకంగా విజయ్ మాల్యా తరహాలో ఉండే క్యారక్టర్ గా డిజైన్ చేయడం ద్వారా ఒక వెరైటీని చూపెట్టడానికి వినాయక్  ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

ఇప్పుడు ఫారిన్ లో తలదాచుకున్న  కింగ్ ఫిషర్ అదినేత విజయ్ మాల్య   కింగ్ ఫిషర్  సంస్థ లోగో పక్షిలా ఇండియా నుండి ఎగిరి పోయాడంటూ కామెంట్లు పడుతున్న నేపధ్యంలో చిరంజీవి ఇలా విజయ్  మాల్యాని  తన 150వ సినిమాకు ఉపయోగించుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

18 ఏళ్ల కిందట వచ్చిన చిరంజీవి ‘చూడాలని ఉంది’ సినిమాలో చిరంజీవితో కలిసి నటించింన అంజలా జవేరీని పెళ్ళి చేసుకున్న తరుణ్ అరోరా ఈసినిమా ద్వార టాలీవుడ్ కు విలన్ గా కనిపించ బోతున్న నేపధ్యంలో ఈ సినిమా పై చాలా అసలు పెట్టుకున్నాడు.   తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రనుచేస్తున్న తరుణ్ అరోరాను విజయ్ మాల్యా  ఒక వెలుగు వెలిగిన రోజులలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే తీర్చి దిద్ది వినాయక్ మెగా అభిమానులకు షాక్ ఇవ్వ బోతున్నట్లు  తెలుస్తోంది. 

ఈ సినిమాలో చిరు తండ్రిగా చలపతి రావు, తల్లిగా అన్నపూర్ణమ్మలు నటిస్తున్న సన్నివేశాలను కూడ రేపటి నుంచి షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఏది ఎలా చూసుకున్నా చిరంజీవి 150వ సినిమాకు విజయ్ మాల్యా  కూడ పరోక్షంగా సహాయ పడుతున్నాడు అనుకోవాలి..  
-



మరింత సమాచారం తెలుసుకోండి: