యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలుసు. అయితే సినిమాలో తారక్ ను కొత్త కోణంలో చూపించిన క్రెడిట్ కొరటాల శివకే దక్కింది. ఇకపోతే సినిమాలో సత్యం పాత్రం అదేనండి మోహన్ లాల్ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. సపోర్టింగ్ రోలే కాని సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిన ఆ పాత్రలో మోహన్ లా మరోసారి కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నడు.


అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ రోల్ లో బాలయ్యను ఊహించుకుంటే.. ఆలోచనే కొత్తగా ఉంది కదా.. సేమ్ ఇలాంటి ప్రశ్ననే దర్శకుడు కొరటాల శివ ముందు ఉంచారు నెటిజెన్లు. అయితే మోహన్ లాల్ కాబట్టే సినిమా మీద అంచనాలు లేకుండా వెళ్లారు. అదే బాలయ్య, ఎన్.టి.ఆర్ చేస్తే కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. సో కథ ఉన్న సినిమాకు కాంబినేషన్స్ కన్నా కథ కథనాలే బలం ఇవ్వాలి. అందుకే జనతా గ్యారేజ్ కు అందరు కనెక్ట్ అయ్యారన్నారు శివ.  


బాలయ్య, తారక్ కాంబినేషన్ అంటే అదో ట్రెండ్ సెట్ సినిమా అందుకే మోహన్ లాల్ పాత్ర ఆయనే అనుకున్నాం. ఏ కోశాన ఈ పాత్రలో బాలకృష్ణ చేస్తే బాగుంటుంది అనిపించలేదు. ఇక మోహన్ లాల్ ను కూడా మలయాళ మార్కెట్ కోసం తీసుకున్నామని వార్తలు వచ్చాయి కాని అలాంటిదేమి లేదని అన్నారు కొరటాల శివ. మొత్తానికి నెటిజెన్లు మాత్రం బాలయ్య, ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో సినిమా చూసేయాలని ఆశతో ఉన్నారు. మరి దానికి సరితూగే కథ ఎప్పుడు వస్తుందో చూడాలి.   


కొరటాల శివ మాత్రం వారిద్దరు చేసే సినిమాకు కథ అద్భుతంగా ఉండాలని.. వారిద్దరు జనతా గ్యారేజ్ లాంటి సినిమా అయితే తీయడం కుదరదని అన్నాడు. అయితే బాబాయ్ మీద మనసులో ప్రేమ ఉన్నా బయటకు చెప్పని తారక్.. ఇక అబ్బాయ్ మీద గుర్రుగా ఉన్న బాలకృష్ణ ఇద్దరు ఇప్పుడప్పుడే కలిసే పరిస్థితులు కనబడట్లేదు.. అయినా ముందు ఇద్దరు కలిసి మాట్లాడనివ్వండి ఆ తర్వాత సినిమా గురించి ఆలోచించొచ్చు అని కామెంట్స్ చేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: