మహేష్ ఇప్పటి వరకు ఎన్నో రకాల పాత్రలలో నటించినా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలలో నటించలేదు.  రాజకీయాల పట్ల నిజ జీవితంలో కూడ ఏ మాత్రం అభిరుచి లేని మహేష్ తన సినిమాల ఎంపికలో పొలిటికల్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు.  అయితే ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి మొదలైంది.

ఈ వార్తల హడావిడి మహేష్ అభిమానులకు జోష్ ను కలిగిస్తూ ఉంటే ఫిలింనగర్ విశ్లేషకులకు మాత్రం ఈ న్యూస్ షాకింగ్ గా మారింది.  ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే కొరటాల శివ మహేష్ తో వచ్చేసంవత్సరం నుంచి మొదలు పెట్టబోతున్న సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉంటూ సోషల్ మెసేజ్ తో ఉంటుందని వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా అనగానే ఎంతోకొంత వర్తమాన రాజకీయాల పై అదేవిధంగా పొలిటికల్ పార్టీల  పై సెటైర్లు వేసేలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండవలసి వచ్చే పరిస్థుతులలో ఇటువంటి పంచ్ డైలాగ్స్ మహేష్ నోటివెంట వస్తే జనం చూస్తారా అన్న సందేహాన్ని కొoదరు వ్యక్త  పరుస్తున్నారు.  అయితే గతంలో వచ్చిన ‘దూకుడు’ సినిమాలో మహేష్ తన తండ్రి పాత్రలో ఉన్న ప్రకాష్ రాజ్ కోసం రాజకీయ వేత్తగా నటించిన విషయం తెలిసిందే.

అయితే ఆ పాత్ర దూకుడు సినిమాలో చాల చిన్నది.  కాని పూర్తి రాజకీయవేత్తగా మారి పొలిటికల్ అవతారలో మహేష్ కనపడితే ఎంత వరకు సాధారణ ప్రేక్షకులు హర్షిస్తారు అన్న అనుమానాలు కూడ ఉన్నాయి.  ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే రామకృష్ణ పరమహంస భోధనలలోని కొన్ని అంశాల ప్రేరణతో కొరటాల శివ మహేష్ తో ఈ సినిమాను తీస్తున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు ఉన్నాయి.

ఉదాత్తమైన రామకృష్ణ పరమహంస సూక్తులను నేటి బ్రష్టు పట్టిన రాజకీయాలతో మిళితం చేస్తూ వ్రాసిన కథను జనం మెప్పించే విధంగా  తీయాలి అంటే కొరటాల శివ ఎంతో కష్టపడాలి. అయితే ‘జనతా గ్యారేజ్’ ఇచ్చిన జోష్ లో కొరటాల శివ తీస్తున్న ఈ రాజకీయ నేపధ్యం సినిమా కూడ బ్లాక్ బస్టర్ హిట్ కోడితే కొరటాల టాలీవుడ్ నెంబర్ వన్  డైరెక్టర్ గా మారాడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: