ఓపికున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అలాగే, అందంగా ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని వంటబట్టించుకోని ఈతరం హీరోయిన్లు ఉండరు. ఇప్పుడు సమంతా కూడా అదే రూట్లో వెళ్తోంది. అందుకోసం రెండు పనులు చేస్తోంది. అందులో మొదటిది శృంగార సన్నివేశాల్లో నటించడం. ఏమాయ చేసావెలో నాగచైతన్య పెదవులతో పెదవులు కలిపి సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు మరోసారి లిప్ లాక్ చేసింది. కాకపోతే ఈసారి సిద్ధార్థ్ తో. జబర్దస్త్ చిత్రంలో సిద్ధూ, సమంతల మధ్య హాట్ సన్నివేశాలున్నాయట. అంతేకాదు, పెదాలు కూడా తడిపేసుకున్నారట. ఇక, రెండోది... పారితోషికం పెంచడం. ఇటీవలికాలంలో అనుష్క, నయనతారలు తమ పారితోషికాలను ఏకంగా కోటి దాటించేశారు. వాళ్లకంటే తానూ ఏం తక్కువ అనుకుందట సమంత. అందుకే తనకూ పారితోషికం కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం సమంతా అగ్ర హీరోలతోపాటూ ఓ కుర్రహీరో సినిమాలోనూ నటిస్తోంది. ఆ కుర్రహీరో మరెవరో కాదు... భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు. అలాంటి నిర్మాత కొడుకు లాంఛింగ్ కి తనను వాడుకుంటున్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందట సమంత. అందుకే, భారీ పారితోషికమే అడిగిందట. ఫామ్ లో ఉన్న హీరోయిన్ కావడం, తన కొడుకు సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకోవడం వంటి కారణాలతో ఆమె డిమాండ్ ని అంగీకరించాడట బెల్లంకొండ. సమంత కూడా బతకనేర్చిందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: