మొన్నటిదాకా రేసులో ఉన్నడా లేడా అన్న దగ్గర నుండి ఇప్పుడు రేసులో నెంబర్ వన్ పొజిషన్ కు తాను సంసిద్ధం అంటున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ హిట్ తో తన విజయ పతాకాన్ని ఎగురవేశాడు. టైగర్ సినిమా హిట్ కొడితే ఏ రేంజ్ ప్రకంపణలు జరుగుతాయో గ్యారేజ్ చూపించింది. అయితే ఇక తర్వాత సినిమా వేటలో ఉన్న జూనియర్ కు పూరి ఏకంగా ఒకటి కాదు రెండు కథలను వినిపించాడట.


జనతా గ్యారేజ్ షూటింగ్ టైంలోనే ఓ కథ వినిపించిన పూరి ఆ కథను తారక్ కూడా ఓకే చేశాడట అయితే గ్యారేజ్ హిట్ తో అంచనాలు మారిపోయాయి.. మరి అదే కథ పూరి వస్తే ఎలా అనుకున్నాడో ఏమో మరో కథతో తారక్ తో చర్చలు జరుపుతున్నాడట. జూనియర్ తో ఆంధ్రావాలా తీసి ఫ్లాప్ కొట్టినా టెంపర్ తారక్ తో ఓ చేంజ్ ఓవర్ వచ్చేలా చేసిన పూరి ఎలాగోలా ఎన్.టి.ఆర్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.


మరి తారక్ కోసం సందించిన రెండు అస్త్రాలలో ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు టెంపర్ తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు తీస్తున్న ఇజంతో తన సత్తా చాటాలని చూస్తున్న పూరి జూనియర్ తో సినిమా ఓకే చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక పూరి ప్రతిభ గురించి తెలిసిన తారక్ కూడా మొదటి ఆప్షన్ పూరినే పెట్టుకున్నాడట.


టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ హిట్లతో బ్యాక్ టూ ఫాం అని తనను తాను ప్రూవ్ చేసుకున్న తారక్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పూరితో సినిమా అయితే అంచనాలను అందుకుంటే మరో సంచాలనం సృష్టించినట్టే మరి తారక్ ఓటు ఎవరికో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: