మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” షూటింగ్ అత్యం త వేగం గా జరుగుతోంది. ఎట్టి పరిస్థితులలోను ఈ సినిమా విడుదలకు సంభందించి ఆఖరి నిమిషం  టెన్సన్స్ ఏర్పడకుండా ఈ సినిమా షూటింగ్ ను  ఎటువంటి బ్రేక్ లు లేకుండా చాలా స్పీడ్ గా పరుగులు తీయిస్తున్నారు . ఇప్పటికే చిరంజీవి తన పాత్రకు సంభందించి డబ్బింగ్ చెప్పే పనులు కుడా ప్రారంభించడంతో ఈ సినిమాను అనుకున్న విధం గా రాబోతున్న సంక్రాంతి రేస్ కు రావడం ఖాయం అయిపోయింది.

ఇది ఇలా ఉండగా  ఈ సినిమాకు బాగా హైక్ తీసుకురావడానికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన పలు ఫోటోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించడం తో పాటు ఈ సినిమాహక్కుల కోసం ప్రయత్నిస్తున్న  బయ్యర్లకు మరింత క్రేజ్ పెంచడానికి చరణ్ చాలా వ్యూహాత్మకం గా ప్రయత్నిస్తున్నాడు .ఈ ప్రక్రియలో భాగం గా ఈ దర్శక నిర్మాతలు మరో ఫోటోను రిలీజ్ చేసారు.

అయితే ఈ సారి మెగాస్టార్ స్టిల్ కాకుండా మెగాస్టార్ కు  ఈ సినిమాలో ఎదురొడ్డి నిలవబోతున్న విలన్ తరుణ్ అరోరా స్టిల్ ను విడుదల చేసారు . ఈ సినిమాలో చిరంజీవికి విలన్ గా నటించే నటుడి ఎంపికకు  చాలా ఆలోచనలు జరిగిన విషయం తెలిసిందే. జగపతి బాబు నుండి ఎందరో టాలీవుడ్ బాలీవుడ్ నటులను విలన్స్ గా పరిశీలించాక చిట్టచివరకు ఈ సినిమాకు విలన్ గా తరుణ్  అరోరాను ఎంపిక చేసారు.   
 
ఈ సినిమాకు సంభందించి తరుణ్ అరోరా తన డైలాగ్స్ ను రిహార్సల్స్ చేస్తున్న సమయంలో తీసిన ఈ స్టిల్ ను చూస్తూ ఉంటే ఈ పాత్ర కోసం తరుణ్  అరోరా బాగా  కష్టపడుతున్నట్లు  కనిపిస్తోంది. ఈ ఫోటోలోని తరుణ్ అరోరా లుక్ ను బట్టి  చూస్తూ ఉంటే ఈ సినిమాదర్శకుడు వినాయక్ ఈ సినిమాలోని ప్రతీ పాత్ర విషయంలో చాలా శ్రద్ద తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమాను 100 కోట్ల కలెక్షన్స్ సినిమాగా మార్చడానికి చరణ్ చాలా వ్యూహాత్మక మైన ప్లాన్స్ వేయడమే కాకుండా ఈ  సినిమా ప్రమోషన్ కోసం చాలా విభిన్నమైన ప్లాన్స్ ఆలోచించడమే  కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముంబాయి కి చెందిన ఒక యాడ్ కంపెనీకి అప్పచెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎట్టి పరిస్థితులలోను 20 కోట్లకు తక్కువ కాకుండా ఉండే విధం గా చరణ్ మాస్టర్ ప్లాన్ వేసాడు అని టాక్ .



మరింత సమాచారం తెలుసుకోండి: