తెలుగు ఇండస్ట్రీలో ‘దేవదాసు’చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రామ్ తక్కువ కాలంలోనే మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ నటించిన సినిమాలు కొన్ని డిజాస్టర్ అయినా కొన్ని మాత్రం యావరేజ్ గా నడిచాయి. గత సంవత్సరం ‘పండగ చేస్కో ’, ‘ నేనూ శైలజ’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.   తాజాగా రామ్ -రాశి ఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మించిన ''హైపర్ '' చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది.  

ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రామ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నాడని సినిమా టైమ్ పాస్ కి చూడొచ్చన్న టాక్ వచ్చింది. భారీ లెవల్లో ఓపెనింగ్స్ లేకపోయినా మంచి వసూళ్లు మాత్రం వచ్చాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో 2.81 కోట్ల వసూళ్ళ టో మంచి ప్రారంభాన్ని ఇచ్చింది .  జిబ్రాన్ సంగీతం అందించిన హైపర్ వసూళ్లు ఇలా ఉన్నాయి . 


ఏరీయా వైజ్ హైపర్ కలెక్షన్లు :


నైజాం             - 1. 51 కోట్లు 


కృష్ణా               - 21 లక్షలు 


గుంటూరు         - 34 లక్షలు 


ఈస్ట్                 - 26 లక్షలు 


వైజాగ్               - 37 లక్షలు 


నెల్లూరు             - 12 లక్షలు 


మొత్తం - 2 . 81 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: