అప్పుడెప్పుడో వెంకటేష్ ని శీను సినిమాలో మూగవాడిగా చూశారు గుర్తుందా. నాలుక లేనట్టు ఓసారి నటిస్తాడు. చివరికి నాలుకే కోసేసుకుంటాడు. ఆ తరవాత వెంకీ అలాంటి పాత్ర చేయలేదు. కానీ ఇన్నాళ్ల తరవాత చేస్తున్నాడు. ఓ చిత్రంలో విలక్షణ పాత్ర పోషించనున్నాడు వెంకీ. అదేంటంటే... మూగవాడిగా. గతంలో దేవకట్టా... వెంకీకి ఒక కథ చెప్పాడు. ఆ కథ వెంకీకి బాగా నచ్చిందట. అందులో కథానాయకుడు మూగవాడు. అయినా ఆ పాత్రను చేయడానికి వెంకీ ఒప్పుకున్నాడట. ఇటీవలికాలంలో మల్టీస్టారర్లకూ, ప్రయోగాత్మక చిత్రాలకూ ముందుంటున్న వెంకటేష్ ఇలాంటి సినిమా చేయడం విశేషం కాకపోవచ్చు గానీ... చాలా సాహసమే అని చెప్పాలి. అగ్రనటుడైన ఆయన కథ నచ్చి, ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకురావడం ఆయనలోని గొప్పదనానికి నిదర్శనం. ఈ చిత్ర కథ నచ్చడంతో సురేష్ మూవీస్ సంస్థే నిర్మిస్తోంది. సో, సొంత బ్యానర్ మీద చాలాకాలం తరవాత మళ్లీ వెంకటేష్ సినిమాలో నటిస్తున్నాడన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: